మళ్ళీ మొదలయిన సీజనల్ రోగాలు..


మొన్నటి దాకా వర్షాల వలన అంటువ్యాధులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసాయి.ఏ ఇంట్లో చూసినఎవరో ఒకరు మంచాన పడ్డ వారే..వాన కాలం నుండి శీతాకాలం సీజన్ చేంజ్ అవడంతో సీజనల్ వ్యాధులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. వర్షాలు తగ్గడంతో డెంగ్యూ ఫీవర్స్ కాస్త తగ్గాయి. గత మూడు నాలుగు నెలలుగా డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని.. ప్రస్తుతం చాలా తగ్గాయంటున్నారు డాక్టర్లు.ఈ నెలాఖరు డెంగ్యూ, చికెన్ గున్యా పూర్తిగా తగ్గుతాయని చెబుతున్నారు.
చాలా పెరగడంతో స్వైన్ ఫ్లూ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే సీటీ లో కొన్ని స్వైన్ ఫ్లూ కేసులు కూడా నమోదయ్యాయి. చలి పెరిగే కొద్దీ.. స్వైన్ ఫ్లూ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో జనం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు
డాక్టర్లు
ఈ సీజన్ లో టీబీ, ఆస్తమా, హార్ట్, కిడ్నీ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చలి పెరిగితే రోగుల సంఖ్య కూడా పెరిగే
అవకాశాలు ఉన్న యంటున్నారు. ఈ సీజన్ లో కచ్చితంగా వేడి ఫుడ్, గోరు వెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలంటున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలని సూచిస్తున్నారు.
మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకూ సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మరో
నాలుగు నెలల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

About The Author