మారుతున్న మరాఠా రాజకీయాలు…
మరాఠా రాజకీయాలు ఎవరికి అర్థం కావడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు వీలు లేకపోవడంతో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అయితే శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వన్నీ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి ఇంకా కూటమిపై క్లారిటీ రావడం లేదు.దీనితో మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కంటిన్యూ అవుతోంది. పార్టీలన్నీ సొంత వ్యూహాలతో ముందుకు పోతుండటంతో రోజుకో మలుపు తిరుగుతోంది. తన కామెంట్లతో శివసేనకు కాక పుట్టిస్తున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ప్రధాని మోడీని కలవబోతున్నారు. పార్లమెంట్ దగ్గర ప్రధానిని పవార్ కలుస్తారని ఎన్సీత నేత నవాబ్
మాలిక్ చెప్పారు. మహారాష్ట్ర రైతు సమస్యలపై మోడి చర్చిస్తారని చెప్పారు. మహారాష్ట్రకు కేంద్రం సాయం చేయాలని కోరుతామన్నారు.
అయితే మహారాష్ట్ర రాజకీయల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో ప్రధానితో శరద్ పవార్ సమావేశం కానుండటం ఆసక్తిగా మారింది. రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చలో
మాట్లాడిన మోదీ..ఎన్సీపీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ప్రధానితో శరద్ పవార్ సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు నరేంద్ర మోడీ తో శరద్ పవార్ సమావేశం పై స్పందించారు శివసేనసీనియర్ నేత సంజయ్ రౌత్. దేశ ప్రధానిని ఎవరైనా కలవొచ్చని చెప్పారు. మహారాష్ట్ర రైతుల కోసమే ప్రధాని మోడీతో శరద్ పవార్ సమావేశం అవుతున్నారని చెప్పారు. రైతులకు కేంద్రం నుంచి మరింత సాయం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు రౌత్.