కన్నతల్లి శవం బస కోసం ఆశగా ఎదురుచూస్తున్న కొడుకు..


ప్రకాశం జిల్లాలో మనత్వం మంటగలిసింది. జిల్లాలోని పామూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న సురేష్ తన తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో అద్దె ఇంటి ఓనర్ ఆమెను ఇంట్లో ఉంచొద్దని కోరడంతో, స్నేహితుల కూడా సహాయం చేయక పోవటంతో సురేష్ చేసేదేమీ లేక చావు బ్రతుకుల మధ్య ఉన్న తన తల్లిని తీసుకొని చెరువు దగ్గర ఉండే పార్కు వద్ద టెంట్ వేసి అక్కడ పడుకో బెట్టి ఏమిచెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. అతని ఆవేదన ఒక్కటే, పామూరు లో 50 శాతం మంది అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఈరోజు నాకు, రేపు మరికొందరికి ఈ సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి అధికారులు, నాయకులు స్పందించి ఇటువంటి పరిస్థితి నుండి బయట పడటానికి ఒక రూమ్ వసతిని ఏర్పాటు చేస్తే ఇలా అన్ని ఉన్న అనాధ లాగ ఉండాల్సిన అవసరం లేదంటున్నాడు సురేష్.

About The Author