ఐదు నెల‌ల్లో అద్భుతాలు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌…


ఐదు నెల‌ల్లో అద్భుతాలు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
1. ఉద్యోగాల విప్ల‌వం..
2. రైతు భ‌రోసా
3. అమ్మ ఒడి
4. అగ్రి గోల్డ్‌
5. ఆరోగ్య శ్రీ‌
6. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌
7. మ‌ద్య‌పాన నిషేదం దిశ‌గా అడుగులు..
8. ఇళ్ల ప‌ట్టాలు
9. వైయ‌స్ఆర్ ఆస‌రా

10. వేత‌నాల పెంపు
11. వాహ‌న మిత్ర‌
12. మ‌న బ‌డి నాడు-నేడు
13.వైయ‌స్ఆర్ కంటి వెలుగు
14. మ‌త్స్య‌కారుల‌కు వైఎస్సార్ భ‌రోసా:

15. రివ‌ర్స్ టెండ‌రింగ్ :

1.ఉద్యోగాల విప్ల‌వం:
ఐదు నెలల్లో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసినవి:

నాలుగు నెలలు పూర్తిగా నిండకుండానే 4.10 లక్షల ఉద్యోగాలు
ఇందులో 1.35 లక్షల శాశ్వ‌త గ్రామ స‌చివాల‌య ఉద్యోగాలు.
వాలంటీర్ ఉద్యోగాలు 2.75 ల‌క్ష‌లు

2. రైతు భ‌రోసా:
రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున రాష్ట్రంలోని 53 ల‌క్ష‌ల మంది రైతుల‌కు సాయం.

3. అమ్మ ఒడి:
జ‌న‌వ‌రి 9, 2020 నుంచి 1వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పిల్ల‌ల‌ను బ‌డికి పంపించే ప్ర‌తి త‌ల్లికి ఏటా రూ.15 వేల చొప్పున సాయం.

43 ల‌క్ష‌ల మంది అమ్మ‌ల‌కు రూ.6455 కోట్లు పంపిణీ చేయ‌నున్నారు

4. అగ్రిగోల్డ్‌:
అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు తొలి విడతలో భాగంగా రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.70 లక్షల మందికి రూ. 263 కోట్లు పంపిణీ చేసింది.

రెండో విడత చెల్లింపుల్లో రూ. 20వేల లోపు డిపాజిటర్లకు పరిహారం అందిస్తారు. దీని కోసం తర్వలోనే రూ. 811 కోట్లు విడుదల చేస్తామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కేటాయించిన రూ. 1,150 కోట్ల మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తుంది.

5. ఆరోగ్య‌శ్రీ‌:
– వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.
-హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు.
– చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం.
– కిడ్నీ, తలసేమియా, కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేల పింఛను.
– కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఇందుకు రూ.1500 కోట్లు కేటాయింపు.
– 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైయస్సార్‌ ఆరోగ్యశ్రీకి కేటాయింపులు – రూ. 1,740 కోట్లు.
– ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది.

6. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌
:
జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తిగా ఫీజు రీయిబర్స్‌మెంట్‌.
– జగనన్న వసతి దీవెన పథకం కింద 2019-2020వ‌ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతీ విద్యార్థికి ఆహారం, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు అందజేత.
– డిగ్రీ, ఉన్నత చదువులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలలు, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కాజీలకు చెందిన విద్యార్థులు ఈ ప‌థ‌కానికి అర్హులు.

7. మ‌ద్య‌పాన నిషేదం దిశ‌గా అడుగులు
-రాష్ట్రంలో 38 స్టార్‌ హోటళ్లు, 4 పబ్బులతో సహా మిగతా మొత్తం 839 బార్ షాపులు ఉన్నాయి

స్టార్‌ హోటళ్లు, పబ్బులు మినహాయిస్తే 797 బార్లు ఉన్నాయి
797లో 40 శాతం అన‌గా 319 బార్లు తగ్గిస్తున్నారు.

-చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రం మొత్తమ్మీద 4,380 ప్రయివేట్ మద్యం షాపులు ఉంటే. వీటి స్థానం లో 880 తగ్గించి 3,500 ప్రభుత్వ మ‌ద్యం షాపులు ఏర్పాటు చేశారు. అన‌గా 20 శాతం తగ్గింపు.

-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 వేల బెల్ట్ షాప్ (గ‌తంలో ఒక్కో షాప్ క్రింద 10 బెల్ట్ షాపు లు ఉండేవి). వీటిని తొల‌గించి మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగులు నింపారు.

-రాష్ట్రవ్యాప్తంగా 3,500 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది సేల్స్‌మెన్‌లను నియమించారు. ఆ విధంగా దాదాపుగా 12 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించారు.

8. ఇళ్ల ప‌ట్టాలు:
-ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు.
– మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ అవసరమైతే ఆ ఇంటిమీద పావలా వడ్డీకే బ్యాంకుల నుంచి
రుణాలు ఇప్పించడం.

9. వైయ‌స్ఆర్ ఆస‌రా :
పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు.
– మహిళలు చెల్లించే వడ్డీని ప్రభుత్వం రాయితీ రూపంలో విడతల వారీగా ఆయా సంఘాల‌ బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేస్తోంది.
– ఈ బడ్జెట్లో డ్వాక్రా మహిళల కోసం రూ. 1,788 కోట్లు కేటాయించారు.
– పాత బకాయిలు – రూ. 3,037 కోట్లు (2016 ఆగస్టు నుంచి 2019 మార్చి వరకు)
– గ్రామీణ పరిధిలోని డ్వాక్రా మహిళలు – రూ. 2,303 కోట్లు
– పట్టణ పరిధిలోని డ్వాక్రా మహిళలు – రూ. 734 కోట్లు
– సున్నా వడ్డీకే రుణ మంజూరు లక్ష్యం – రూ.16,819 కోట్లు
– వడ్డీ రాయితీకి బడ్జెట్లో కేటాయింపులు :
1) గ్రామీణ ప్రాంతాల్లో – రూ. 1,140 కోట్లు
2) పట్టణ పరిధిలో – రూ. 648 కోట్లు

10.వేత‌నాల పెంపు
-ప్ర‌భుత్వం ఆయా రంగాల్లో ప‌ని చేస్తున్న వారికి వేత‌నాలు పెంచింది.
– ఆశా వ‌ర్క‌ర్ల‌కు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
– బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు.
-హోం గార్డుల‌కు రూ.18వేల నుంచి రూ.21 వేలకు పెంపు.
– వీవోఏ(వెలుగు యానిమేట‌ర్లు) వేత‌నం రూ.3 వేల నుంచి 10 వేల‌కు పెంపు
– 108 పైలెట్‌(డ్రైవర్‌)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని రూ.30 వేలకు పెంచారు.
– 104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26 వేలకు పెంచారు.
-మధ్యాహ్నభోజన కార్మిలకు నెలకు రూ.3 వేలు జీతం పెంచుతూ నిర్ణయం

11.వైయ‌స్ఆర్ వాహ‌న‌ మిత్ర‌:
ఏపీలో ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ‌లు చేస్తున్నారు.ఈ డబ్బును వాహనాలకు ఫిట్‌నెస్‌, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలి.

12.మ‌న బ‌డి నాడు-నేడు:
మనబడి నాడు-నేడు’లో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 45 వేల‌ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనుంది.
– తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నారు.

13. వైయ‌స్ఆర్ కంటి వెలుగు
రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి.. వారి నేత్ర సమస్యలకు పరిష్కారం చూపడమే కంటివెలుగు పథకం ముఖ్యోద్దేశ్యం. ఈ పథకానికి తొలి విడతలో.. సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపిస్తారు. తర్వాత.. 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెట్టనుంది ప్రభుత్వం.

14 మ‌త్స్య‌కారుల‌కు వైఎస్సార్ భ‌రోసా:
మత్య్సకారులకు వైఎస్సార్ భరోసా ప‌థ‌కం కింద ఆర్థిక సాయం
– ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు రెండు నెలలు చేపల వేట నిషేధం స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేవ‌లం నెల‌కు రూ.2 వేల చొప్పున రూ.4 వేలు ఇస్తే..వైయ‌స్ జ‌గ‌న్ రూ.5 వేల చొప్పున ఆ రెండు నెలలకు గాను రూ.10వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.

15. రివ‌ర్స్ టెండ‌రింగ్ :
రివ‌ర్స్‌టెండ‌రింగ్ ద్వారా ప్రాజెక్టుల్లో రూ.1230 కోట్లు ప్ర‌జాధ‌నం ఆదా

చంద్ర‌బాబు నాయుడు అధికారం నుంచి దిగిపోతూ..రూ.65 వేల కోట్ల పెండింగ్ బిల్లుల‌తో క‌లిపి రూ.2.4 ల‌క్ష‌ల కోట్ల అప్పుల కుప్ప‌గా రాష్ట్రాన్ని మార్చి ఖ‌జానా ఖాళీ చేశారు.

వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం రోజున కేవ‌లం రూ.100 కోట్లు మాత్ర‌మే మిగిల్చాడని మే 30, 2019న టీడీపీ క‌ర‌ప‌త్రిక ఈనాడు క‌థ‌నం ప్ర‌చురించింది.

అయినా కూడా ఇంత స్వ‌ల్ప‌కాలంలో ఎవ‌రు చేయ‌ని విధంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తూ సుప‌రిపాల‌న చేస్తుంటే ఓర్వ‌లేని చంద్ర‌బాబు ఆయ‌న పార్ట్‌న‌ర్ ప‌వ‌న్, బాబు అను కుల మీడియా జ్యోతి, టీవీ5, ఈనాడు నిత్యం మ‌త విద్వేషాలు ర‌గిలిస్తూ హిందువుల‌ను జ‌గ‌న్‌కు దూరం చేసేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు.

About The Author