మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం…


మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అత్యంత సీక్రెట్‌గా జరిగిపోయింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. ఐతే… గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ… ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం, ఆయన వెంటనే సీఎంగా ప్రమాణం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐతే… నిన్నటి వరకూ… కాంగ్రెస్, శివసేనతో కలిసిన ఎన్సీపీ… రాత్రికి రాత్రి పార్టీలో చీలిక రావడంతో… ప్లేట్ తిప్పేసింది. వెంటనే బీజేపీతో చేతులు కలిపింది. దాంతో… మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఐతే… ఈ విషయం తెల్లారే వరకూ బయటకు తెలియనివ్వకుండా బీజేపీ జాగ్రత్తపడి… శివసేన రాజకీయాలకు బ్రేక్ వేసింది.

About The Author