న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా తైక్వాండో శ్రీను…


న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బి.ఎస్.ఎస్.ప్రసాద్ కుమార్ (తైక్వాండో శ్రీను) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో శనివారం జరిగిన అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.

2019 నుంచి 2023 వరకూ ఈ నూతన కార్యవర్గం కొనసాగనుంది. ఈ మేరకు న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గంలో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీనుకి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. రాష్ట్ర అధ్యక్షులుగా జి.నాగేశ్వరరావు,ప్రధాన కార్యదర్శిగా పి.అచ్చుతరెడ్డిలతో పాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీనుకి అవకాశం లభించింది.

ఈ నూతన కార్యవర్గ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ జిల్లా జడ్జి ఆర్ లక్ష్మి శంకర్ వ్యవహరించగా ,శాప్ పరిశీలకుడుగా విజయవాడ జిల్లా చీఫ్ కోచ్ ఎ.మహేష్ బాబు,తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పరిశీలకుడుగా మన్మోహన్ బన్జా హాజరయ్యారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అచ్చుతరెడ్డి వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లాకి చెందిన బి.ఎస్.ఎస్.ప్రసాద్ కుమార్ ( తైక్వాండో శ్రీను)కి న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్ లో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించడం పట్ల జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతు సాయిరాం, ఉపాధ్యక్షులు వైశ్య రాజు మోహన్ తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేసారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా అభినందనలు తెలియజేసారు.

About The Author