ఎన్ని జన్మల పుణ్యఫలమో …. ఇలాంటి బిడ్డపుట్టాడు…
https://www.facebook.com/203995246837493/videos/435331480462682/?t=74
పువ్వు పుట్టగానే పరమళిస్తుంది అన్నచందంగా కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ప్రముఖులవుతారు. ప్రపంచంలో ఎవరికీ లేని అనితర సాధ్యమైన మేథాసంపత్తితో పుట్టిన బిడ్డ లారెన్స్ సీమెన్స్. 9 ఏళ్ళకే సీమెన్స్ నెదర్లాండ్స్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ తీసుకోబోతున్నాడు. మెదడులోని ఒక భాగం ఎలా పని చేస్తుందో తెలియజేస్తూ ఒక కంప్యూటర్ సర్క్యూట్ రూపొందించాడు. సాధారణంగా పిల్లలకు ఐక్యూ స్థాయి గరిష్టంగా 120 నుంచి 129 వుంటే వాళ్ళను అద్వితీయ మేథో బాలలుగా గుర్తిస్తారు. ఇటువంటి పిల్లలు ప్రపంచ జనాభాలో 4.6 శాతం మాత్రమే వున్నారు. అయితే లారెన్స్ సీమెన్స్ ఐక్యూ పవర్ 145 కంటే ఎక్కువగా వుంది. ప్రపంచంలో ఏ పిల్లాడికి ఇంత ఐక్యూ పవర్ లేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంత ఐక్యూ పవర్ వున్న ఒకే ఒక్క బాలుడు లారెన్స్ సీమెన్స్. బ్రెయిన్ ఆన్ చిప్ అనే ప్రాజెక్టును అభివృద్ది చేసిన సీమెన్స్ మెదడు పనిచేసే విధానాన్ని కంప్యూటర్ చిప్ లో పొందుపరచడంతో పాటు మనం తీసుకునే మందులకు మెదడు ఎలా స్పందిస్తుందనే విషయం మీద కూడా అధ్యయనం చేశాడు. బయో మెడికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ రెండు విభాగాల్లో తొమ్మిదేళ్ళ సీమెన్స్ ప్రతిభ అద్వితీయం. ఈ రెండింటినీ ఒకటిగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కూడా లేరు. ఈ బాలుడు ఒక్కడే. సీమెన్స్ వచ్చేనెల నెదర్లాండ్స్ లోని ఎన్డీవోన్స్ టెక్నాలజీ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత మెడిసిన్ లో డిప్లమా చేస్తూ పీహెచ్డీ చేయాలన్నది సీమెన్స్ ఆశయం. బెల్జియంలో పుట్టిన సీమెన్స్ ఇప్పుడు నెదర్లాండ్స్ లో వున్నాడు. ఏడాదిలో హైస్కూల్ పూర్తి చేశాడు. మూడేళ్ళ డిగ్రీ కోర్సును 9 నెలల్లో పూర్తి చేశాడు. సీమెన్స్ బ్రెయిన్ పనితీరును పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆ బాలుడు ఎంత వేగంగా పనిచేస్తుందో ఆ మెదడులో ఏం జరుగుతుందో తాము ఊహించలేకపోతున్నామని తెలిపారు. గతంలో అమెరికన్ బాలుడు మైఖేల్ కెర్నీ 1994లో పది సంవత్సరాల 4 నెలల్లో డిగ్రీ పొంది గిన్నీస్ రికార్డులో స్థానం పొందాడు. కృత్రిమ అవయవాల మీద పరిశోధనలు చేసి తన సొంత ల్యాబొరేటరీలో కృత్రిమంగా ఒక మనిషిని తయారు చేయాలన్నది తన లక్ష్యమని సీమెన్స్ చెబుతున్నాడు. సీమెన్స్ బొమ్మలతో ఆడుకుంటూనే చదువుతో కూడా ఆడుకుంటాడని, తమ ఆలోచనల కన్నా అందనంత ఎత్తులో కొడుకు వున్నాడని తండ్రి అలెగ్జాండర్ సంబర పడిపోతున్నాడు.