కిష్టారెడ్డి గ్రామ పంచాయతీ మీద విచారణ జరిపించండి…..

https://www.facebook.com/9staartv1/videos/449963135708156/?t=0
అమీ న్ పూర్ మండలంలోని కిష్టారెడ్డి పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కిష్టారెడ్డి పేట ఉప సర్పంచ్ ఎండి. పాయిమ్ కోరారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు….

అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డి పేట గ్రామ పంచాయతీ లో సర్పంచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జర్పించాలని గ్రామ ఉప సర్పంచ్ ఎండి ఫాయేం,పంచాయతీ పాలక వర్గ సభ్యులు కోరారు.గతంలో ఇక్కడ పని చేసిన అధికారులు, సిబ్బంది , సర్పంచ్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే పరిస్థితి ఎంతవరకు వచ్చిందని ఇదంతా జరగకుండా అధికారులు పంచాయతీ కార్యాలయంలో రికార్డులను మాయం చేశారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం లో పూర్తిస్థాయిలో విఫలం అవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తమకు తెల్పకుండ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలి అని ప్రజలు కోరుతున్నారు. కానీ అధికారులు మాత్రం నోటీసుల పేరుతో గ్రామ పంచాయతీలు పరిధిలో నడుస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం కాకుండా వాటికి ముందుగా పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే వారు కూడా నష్ట పోరని వారు తెలిపారు. ఏది ఏమైనా కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ఉన్నత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామంలో ప్రజలకు మంచినీరు అందించాలని కోరుతున్నామని కోరారు.ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు శ్రీకాంత్,దొంతి అశోక్,బండి సంతోష,మనెమ్మ,విజయ, భాగ్య లక్ష్మి,ఎండి. గౌస్ పాల్గొన్నారు.
బైట్.

1.ఎండి.పాహీం.ఉప సర్పంచ్.కిష్టారెడ్డి పేట.

2.గ్రామ పంచాయితీ పాలకవర్గ సభ్యులు.

సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజకవర్గం (కిట్టు చారీ విలేకరి)

About The Author