ఏపీలో మారిన రేషన్ కార్డు రూల్స్.. వారికి షాక్..!
ఏపీలో ఆహార భద్రత నియమాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో వార్షికాదాయంతో పాటు ఇతర నిబంధనల్లోనూ మార్పులు చేసింది. దీని ప్రకారం గ్రామాల్లో వార్షికాదాయం రూ.1.20లక్షలు, పట్టణాల్లో వార్షికాదాయం రూ.144లక్షలు ఉన్న వారు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులుగా అవ్వనున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను బీపీఎల్ కోటా(రేషన్ కార్డు) కింద పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త నిబంధనల ప్రకారం ఫోల్‌వీలర్స్(కారు) ఉన్న వారికి రేషన్ కార్డుకు అనర్హులు.