Happy Navy day…
“”ఘాజీ”” ఈ పేరు వినగానే భారత దేశ యుద్ధ చరిత్రలో ఒక గొప్ప విజయం గుర్తుకు వస్తుంది. PNS Ghazi… ఇది ఒక పాకిస్థాన్ జలాంతర్గామి. అసలు ఈ ఘాజి జలాంతర్గామి కథ ఏంటి!? మన నేవీ దీన్ని ఎందుకు ధ్వంసం చేసింది ? చూద్దాం ….
58,000 పైగా సిబ్బంది ఉన్న ఇండియన్ నేవీ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద నావికా దళం. రక్షణతో పాటు, పకృతి వైపరీత్యాలలో, 1965 లో ఇండో ,పాక్ యుద్ధ సమయంలో కూడా కీలక పాత్ర పోషించింది.
1971 భారత్ -పాక్ యుద్ధంలో, కరాచీ పోర్ట్ ను భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో, భారత్ ను నేరుగా ఢీ కొట్టే ధైర్యం లేని పాకిస్థాన్, ఒక దొంగ దెబ్బ తీయాలని కుట్రలు పన్నింది.
దాన్లో భాగంగా, అమెరికా నుంచి నాలుగేళ్ళు లీజుకు తీసుకున్న శక్తిమంతమైన జలాంతర్గామి PNS GHAZI ని భారత్ పై ఉపయోగించి, భారత్ కు చెందిన అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియెర్ INS VIKRANTH యుద్ధ నౌకను ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది. ఈ దాడికి, ఈస్ట్ పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో ప్లాన్ వేసినట్లు, భారత్ కు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది.
అప్పుడే, మద్రాస్ పోర్టులో మెయింటె నెన్స్ పూర్తి చేసుకున్న విక్రాంత్ తిరిగి అక్టోబర్ 14 న విశాఖపట్నం చేరుకుంది. పాకిస్తాన్ టార్గెట్ INS విక్రాంత్ మాత్రమేనని తెలుసుకున్న భారత్ నేవల్ కమాండోస్ INS విక్రాంత్ యుద్ధ నౌకను రహస్యంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కు పంపారు. కానీ మన నేవీ తెలివిగా, మద్రాస్ పోర్ట్ లోనే విక్రాంత్ ఉన్నట్టు న్యూస్ పేపర్లలో ప్రకటిస్తూ, పాకిస్థాన్ ను నమ్మించింది.
14/11/1971న ఘాజీ, విక్రాంత్ ను నాశనం చేయడమే లక్ష్యంగా యుద్దానికి బయల్దేరింది. 23/11/1971 న విక్రాంత్ , మద్రాస్ నుంచి విశాఖపట్టణం కు బయల్దేరుతుందన్న నమ్మకంతో , మద్రాస్ కు దగ్గరగా సముద్రంలో, 30మీటర్ల లోతున, తమ టార్పెడోలతో, మాటువేసింది ఘాజి.
04/12/1971, ఘాజి ఉనికిని పసిగట్టిన భారత్, మద్రాస్ నుండి INS Rajputh యుద్ద నౌకను రంగంలోకి దించింది. వెంటనే, ఘాజి రాజపుత్ ను అనుసరిస్తూ, విశాఖ వైపు కదిలింది. అయితే భారత్ నేవీ, PNS ఘాజీని అయోమయంలో పెట్టేందుకుదుకు, ఘాజీకి రాజపుత్ నౌక నుండి, రష్యా భాషలో సిగ్నల్స్ పంపింది. దీంతో ఘాజీ, ఇది భారత నౌక కాదు , రష్షన్స్ ది అనే అపనమ్మకంతో INSరాజపుత్ ను టార్గెట్ చేయలేదు.
ఆ తర్వాత కొన్ని మైళ్ల దూరం వెళ్ళిన రాజ్ పుత్ కావాలనే, ఘాజికి తన బలమైన సిగ్నల్స్ ని పంపడం మొదలు పెట్టింది. దీంతో ఘాజీ ఏదో పెద్ద షిప్ దగ్గర్లో ఉందని అదే INS విక్రాంత్ అయింటుందని పొరబడి, మిస్సైల్స్ వదిలి, తన లొకేషన్ ను మనకు చెప్పకనే చెప్పింది. ఆ ఘాజి సిగ్నల్స్ కోసమే గాల్లో తిరుగుతూ, కాచుకుని కూర్చున్న భారత నేవీ కి చెందిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే ఘాజీ ఉన్న లొకేషన్ వైపు, రెండు anti-submarine మిస్సైల్స్ ను వదిలింది. అంతే, సముద్ర గర్భంలో భారీ పేలుడు. ఆతర్వాత రాజ్ పుత్ కు ఘాజీ వైపు నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాలేదు. దీంతో ఘాజీ ధ్వంసమైందని భారత్ నేవీ నిర్ధారించుకుంది.
ఈ పాక్ జలాంతర్గామిలో, 11 మంది ఆఫీసర్లతో సహా, 92 మంది పాక్ నేవీ సిబ్బంది ఉన్నట్టు తెలిసింది . ఇది భారత్ నేవీ సాధించిన అద్భుతమైన విజయంగా చెప్పుకుంటారు. ఇప్పటికీ, విశాఖ సముద్ర తీరానికి కాస్త దూరంలో భారత్ ద్వంసం చేసిన, ఈఘాజి శిథిలాలు సముద్ర అట్టడుగున ఉన్నాయి.
అలాంటి గొప్ప విజయం సాధించిన మన నేవీ కి మనమందరం ఋణపడివున్నాం.
Once again Happy Navy Day.