ఆడు మగాడ్రా బుజ్జి.. విశ్వనా థ్ చెన్నప్ప సజ్జాన్నార్ …


1996 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి…ప్రస్తుతం సైబారాబాద్ పోలీస్ కమిషనర్..సౌమ్యంగా కనిపిించే సజ్జాన్నార్ విధి నిర్వహణలో మాత్రం ధీరుడైన యోధుడు… బాధితులకు న్యాయం చేయాలని పరితపించే పోలీస్ క్యాప్…చట్టాల పరిధి దాటకుండానే తన పని తాను చేసుకునే సైలెంట్ కాప్…. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ దూసుకుపోతున్న సజ్జాన్నార్ చేసిన పని ఒక్కటే.. దిశను హత్య చేసిన నిందితులను సరిగ్గా అదే స్పాట్ లో ఎన్ కౌంటర్ చేయడం… దిశ కేసు వివరాలలోకి వెళితే హైద్రాబాద్‌ శివార్లలోని తొండుపల్లి టోల్‌గేట్‌ దగ్గర.. నవంబర్‌ 27న అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్‌ లు ఫుల్లుగా మద్యం సేవించారు. దిశను నమ్మించి వంచించారు. అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై తమ లారీలోకి ఎక్కించారు. చావుబతుకుల మధ్య ఉన్నా ఏ మాత్రం కనికరం చూపించలేదు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర ఆమె భౌతిక కాయాన్ని బ్రిడ్జి కింద పడేశారు. ఆమె బతికి ఉంటుందనే అనుమానంతో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఇప్పుడదే స్పాట్‌కు జస్ట్‌ అర కిలోమీటర్ దూరంలో ఆ నలుగురు హతమయ్యారు. పోలీసుల తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. దిశ హత్యాచార ఘటనను సైబారాబాద్ కమిషనర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. నిందితులను ఫోన్‌కాల్‌ ఆధారంగా వెంటనే ఆ నలుగురిని పట్టుకున్నారు. అరెస్ట్ అయిన రోజునే నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ ప్రజల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి.. కానీ చట్ట ప్రకారమే సజ్జాన్నార్ తన విధులు కొనసాగించారు.. ఈ క్రమంలోనే దిశపై దారుణానికి ఎలా ఒడిగట్టారనే కోణంలో నిర్ధారణ చేసుకునేందుకు. పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు.. ఆ నలుగురిని చటాన్‌పల్లికి తీసుకెళ్లారు. శరీరంలోని ప్రతి కణంలో నేర మనస్తత్వం నింపుకున్న ఆ నలుగురు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.. వారి నుంచి తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించారు.. పోలీసులకు చిక్కకుండా పరుగులు తీశారు. పోలీసులు వారి వెంట పడ్డారు. పట్టుకునేందుకు ప్రయత్నించారు. గాలిలోకి కాల్పులు జరిపారు.. కానీ ఆ నలుగురు జంక లేదు..పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిపై కాల్పులు జరిపారు..నలుగురు ఈ ఎన్ కౌంటర్ లో మరణించారు.. ఎన్ కౌంటర్ లో దిశ నిందితులు మరణించారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.. దీంతో కమిషనర్ సజ్జాన్నార్ కి దేశ వ్యాప్తంగా మన్ననలు అందుతున్నాయి.. సాధారణంగా ఎన్ కౌంటర్ జరిగితే పోలీసులు విమర్శలే బహుమానాలు లభించాయి.. కానీ ఈ ఎన్ కౌంటర్ తర్వాత సజ్జాన్నార్ బృందంపై పూల వర్షం కురిసింది.. సజ్జాన్నార్ చిత్ర పటాలతో ఎక్కడికక్కడ సంబారాలు చేసుకుంటున్నారు.. బహుశ దేశంలో ఇటువంటి ప్రశంస అన్ని వర్గాల నుంచి లభించడం ఇదే మొదటిసారి..సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ, రాజకీయ నేతల నుంచి అమాత్యుల వరకూ ఈ ఎన్ కౌంటర్ సమంజసం, సజ్జాన్నార్ కు అభినందనలు అంటూ సోషల్ మాధ్యమాల్లో ట్విట్స్ వైరల్ అవుతున్నాయి.. ఈ కేసు డీల్ చేస్తున్నది సజ్జాన్నార్ అని తెలిసినప్పుడు నిందితులకు ఎన్ కౌంటర్ తథ్యమనే ఊహగానాలు వెల్లువెత్తాయి.. దీనికి తోడు ప్రజల నుంచి కూడా ఎన్ కౌంటర్ చేయాలంటూ సజ్జాన్నార్ పై వత్తిడి ఉంది.. ఎందుకంటే గతంలో ఇదే తరహ కేసులో ఆయన చేసిన ఎన్ కౌంటర్ ను అందరూ ప్రస్తావిస్తున్నారు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2008 డిసెంబరు 10వ తేదీన వరంగల్ లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వప్నిక, ప్రణీత లు బైక్ పై ఇంటికి వెళుతున్న సమయంలో శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడి అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన ప్రణీత తర్వాత నిదానంగా కోలుకుంది. ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టైన మూడు రోజుల తర్వాత యాసిడ్ దాడి కేసు రీ కనస్ట్రక్షన్ కోసం శ్రీనివాస్, సంజయ్, హరికృష్ణలు సంఘటన జరిగిన స్థలం వద్దకు తీసుకువచ్చారు.. అప్పుడే ఆ ముగ్గురు తప్పించుకునే ప్రయత్నం చేశారు.. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు..తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, ఆత్మరక్షణ కోసమే పోలీసుల కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రకటించారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అప్పుడు, ఇప్పుడు జరిగిన ఎన్ కౌంటర్ క్రెడిట్ కూడా సజ్జాన్నార్ దే….సరిగ్గా 11 ఏళ్ల తరువాత సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయ్యింది. అప్పుడు, ఇప్పుడు డిసెంబర్ నెల కావడం గమనార్హం. ప్రజాభిప్రాయం అనుగుణంగా నిందితులకు శిక్ష పడటంతో సజ్జాన్నార్ ను ఇప్పుడ అందరూ వాడు మగాడ్రా బుజ్జి అంటున్నారు..

About The Author