సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్…

హైదరాబాద్:దిశను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులుఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం.. నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశాం.. నవంబర్ 30వ తేదీన నిందితులను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాం.. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించాం. ఆ తర్వాత నిందితులను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నాం.. కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారిని అనేక కోణాల్లో ప్రశ్నించాం… కొన్ని వస్తువులను రికవరీ కోసం ఘటనా స్థలానికి నిందితులను తీసు కొచ్చం..సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా. దిశ ఫోన్ ఇక్కడ పెట్టాం, అక్కడ పెట్టామంటూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత పోలీసులపై రాళ్లు, చేతికి దొరికిన కర్రలతో దాడి చేశారు..వెపన్స్ తీసుకుని పోలీసులపై కాల్పులకు యత్నించారు.ఈ దాడిలో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు కూడా .లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా నిందితులు వినకపోవడంతో చివరకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది.కొద్ది సేపటి తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందుకు వెళ్లి చూడగా..

మృతదేహాలు పడి ఉన్నాయి.పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి,ఇక, నిందితులు గతంలోనూ నేరాలకు పాల్పడినట్టు అనుమానంగా ఉందని..

ఇంకలోతై విచారణ జరుపుతాము శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది

About The Author