షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం ముందుకు సీపీ సజ్జనార్…


బ్రేకింగ్ న్యూస్
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సుప్రీం కోర్టు ముందు నేడు హాజరుకానున్నారు. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులను స్వయంగా కోర్టుకు వివరించనున్నారు. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు. దీంతో.. సుప్రీం కోర్టు తమ ఎదుట హాజరు కావాలని సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది. కాగా, ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కోర్టు ముందు హాజరై ఎన్‌కౌంటర్‌పై వివరణ ఇవ్వనున్నారు.

About The Author