నాతోనే ‘దిశ చట్టం’ అమలు చెయ్యాలి…


నాతోనే ‘దిశ చట్టం’ అమలు చెయ్యాలి ‘దిశ’ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. మద్యం నియంత్రణపై సభలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పోస్టులు వెల్లువెత్తాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణపై మహిళలు మాట్లాడకూడదా..? నేనేదో తప్పుగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆమె అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఎలాగైనా.. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు ఎమ్మెల్యే భవానీ. దిశ చట్టం నా నుంచే మొదలు కావాలని.. అసెంబ్లీ సాక్షిగా ఆమె అన్నారు. దీనిపై వైసీపీ నాయకురాలు హోంమంత్రి సుచరిత స్పందిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే భవానీపై సోషల్ మీడియాలో పెట్టిన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

About The Author