ఎపికి మూడు రాజధానులు…
ఎపికి మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చు అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. సౌతాఫ్రికాకి మూడు రాజధానులు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఎపిలో అభివృద్ధికి మూడు రాజధానులు అవసరం ఉందన్నారు.. అసెంబ్లీలో రాజధాని గురించి జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ, . పాలన ఒక దగ్గర, జ్యుడీషియల్ ఒక దగ్గర ఉండొచ్చు అన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చన్నారు. కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ పెట్టొచ్చు అన్నారు. ఏపీ రాజధాని అంశంపై పని చేస్తున్న నిపుణుల కమిటీ.. వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు ఉంటాయేమో అని అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు. మనం కూడా మారాలి అన్న జగన్ప రిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు పైనా టిడిపి పైనా వివర్శలు చేశారు జగన్.. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు ఏ రకంగా భూములు కొన్నారో వివరించడం జరిగిందన్నారు. రాజధానిపై కేవలం 5 వేల 800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. రాజధానికి రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పారని… కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 వేల 800 కోట్లు మాత్రమే ఖర్చు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. దీనిపై వడ్డీనే ఏడాదికి రూ.770 కోట్లు అవుతోందన్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడికి ఎక్కడి నుంచి అప్పులు తేవాలని ప్రశ్నించారు. 53 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎకరానికి రూ.2 కోట్లు కావాలన్నారు. మొత్తంగా లక్షా 9 వేల కోట్లు అవసరమన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు రాజధానికి ఖర్చు చేసింది కేవలం 5 వేల 800 కోట్లేనని తెలిపారు. 53 వేల ఎకరాల అభివృద్ధికి లక్ష కోట్లు కావాలన్నారు. ఏపీలో స్కూల్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో ఎలుకలు కరిచి రోగులు చనిపోయిన పరిస్థితి చూశామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలన్నారు. పోలవరం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దాని కోసం రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా చేశారని చెప్పారు.