తుడ పరిధిలో పారదర్శక పాలన…


* నిబంధనలు అతిక్రమించి లేఅవుట్ లు విక్రయిస్తే క్రిమినల్ కేసులు
* లైసెన్సుడు సర్వేయ ర్లు అవగాహనతో మెలగాలి
* తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా తుడ పరిధిలో పారదర్శక పాలన అమలుకు శ్రీకారం చుట్టామని తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం తుడ కార్యాలయంలో ప్రణాళికా విభాగం, రియల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడినా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. తుడ అధికారులు కూడా పారదర్శకంగా సేవలందిస్తారని తెలిపారు. అవినీతిని ప్రోత్సాహించరాదన్ సూచించారు. అలాకాదని ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడినట్లు పిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో పరిస్థితిని నేను పోస్టుమార్టం చేయదలచూ కోలేదని అన్నారు. రియల్ వ్యాపారులు తుడ నిబంధనలకు వ్యతిరేకంగా లే అవుట్ వేసి ప్లాట్లు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా సదరు రియల్టర్లు జాబితా బ్లాక్ లిస్టులో పెడతామ

About The Author