తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ పెడరెషన…
https://m.facebook.com/story.php?story_fbid=534883070435039&id=266763133913702
***రామచంద్రపురం మండలం లోని లక్ష్మీ గార్డెన్స్ లో తెలంగాణ సాధన , ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా చారిత్రక అవసరంగా ఆవిర్భవించిన తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( TUTF ) ఆధ్వర్యంలో లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయుల అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రాతినిధ్యాలు చేస్తోంది .
ఈ ఏదేశం అభివృద్ధి చెందాలన్నా అక్కడి సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని ముందుకు సాగాలి . తెలంగాణ రాష్ట్రంలో కావల్సినన్ని మానవ వనరు ఉన్నాయి . ఈ వనరులను సక్రమంగా , సమర్థవంతంగా వినియోగించుకుంటే తెలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది . ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో సంస్కరణలు తీసుక మరింత సమర్థవంతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది . పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విద్యను పటిష్టం చేయాలి . అన్ని పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించడంతో పాటు బడ్జెట్ లో విద్యకు అధిక నిధులు కేటాయించాలి . ప్రాథమిక విద్యను మాతృభాష బోధనతో పాటు , ఉన్నత పాఠశాలల్లో ప్రజలు , తల్లిదండ్రుల కోరికను మన్నించి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి . ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన డిజిటల్ విద్యను సమర్థవంతంగా వినియోగించుటకు తగు వసతులు కల్పించాలి . విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం కోసం ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల సూచనలు , సలహాలు తీసుకోవాలి . అదే విధంగా ఉపాధ్యాయ రంగంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం సత్వరం పరిష్కరించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మ లచ్చిరాం, స్వర్ణ లతా, మమతా, తదితరులు పాల్గొన్నారు