టిటిడి పాలకమండలి నిర్ణయాలు…


✍️జనవరి 6,7 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరచి వీలైనంత మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు
చేస్తున్నాం…

✍️2019-20 సంవత్సరానికి సంబంధించి 3263 కోట్లతో టిటిడి బడ్జెట్ రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశం.

✍️1231 కోట్ల హుండీ, 330 కోట్ల రూపాయలను ప్రసాదాల ద్వారా రాబడిని యోచిస్తున్న టిటిడి.

✍️తిరుపతిలోని పద్మావతి, శ్రీనివాస కల్యాణ మండపాలు ఏ.సి గా తీర్చీదిద్దాలని నిర్ణయం.

✍️టిటిడి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో నూతన అకౌంటెంట్ల పోస్టుల భర్తీకి అనుమతి.

✍️ముంబైలో నూతన శ్రీనివాస ఆలయం నిర్మాణం కు అనుమతి..

✍️గుజరాత్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం.

✍️ జమ్ము కాశ్మీర్, వారణాసి లో శ్రీవారి దేవలయం నిర్మించేడానికి బోర్డు నిర్ణయం.

✍️తిరుమల వరహస్వామి ఆలయ బంగారు తాపడం కు 14 కోట్లు కేటాయింపు..

✍️తిరుమల రెండు ఘాట్ రోడ్లలో మరమ్మతులకు ఎక్స్పెర్ట్ కమిటీ నిర్ణయం మేరకు సిసి రోడ్ల నిర్మాణం..

✍️టిటిడి సైబర్ సెక్యూరిటీ విభాగానికి ప్రఖ్యాత ఐ.టి కంపెనీల సహకారంతో ప్రత్యేక అధికారి నియామకానికి ఆమోదం..

✍️ఇటీవల ఒక ప్రధాన దిన పత్రిక లో వచ్చిన యేసయ్య కథనంతో టిటిడి పరువును నష్టం కలిగించేలా ఉండడంతో 100 కోట్ల కు పరువు నష్టం దావా వేస్తున్నాం.

✍️టిటిడి ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులకు తిరిగి బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం.

✍️టిటిడి ఉద్యోగులు నియామకానికి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం.

✍️బర్డ్ డైరెక్టర్ గా చెన్నై కి చెందిన డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ని నియమిస్తూ ఆమోదం తెలిపిన పాలకమండలి.

*టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..*

About The Author