నేడు రాజదాని 29 గ్రామాల్లో బంద్…


మందడం తుళ్ళూరు పెదపరిమి గ్రామాల్లో 18 వరోజు మహాధర్నా కార్యక్రమాలు
వెలగపూడి లో 18 వరోజు రాజధాని రైతుల రిలే నిరాహారదీక్ష కార్యక్రమం
అమరావతి రాజధాని లో 29 గ్రామాల్లో బంద్ తుళ్లూరు, మందడంలో వంట వార్పు,మానవహారం,తాడికొండ అడ్డరోడ్డు వద్ద మహాధర్నా అన్ని గ్రామాల్లో18 వరోజుకు చేరుకున్న మహాధర్నా అమరావతి
మందడంలో ఉదయం నుంచి బంద్ వాతావరణం నెలకొంది మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి రైతులు వచ్చారు పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణ చేస్తున్నారు
తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించరాదని గ్రామస్తులు నిర్ణయించారు తమ దుకాణాల ముందు సైతం పోలీసులు కూర్చోవటానికి వీల్లేదని స్పష్టం చేశారు
పోలీసు వాహనాలను అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్లటానికి వీల్లేదని రైతులు వెనక్కి పంపేశారు ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది
దుకాణాలు తెరవనీయకుండా రైతులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింప చేశారు తుళ్ళూరులో దుకాణాలను స్వచ్చందంగా దుకాణాలను మూసివేసిన వ్యాపారులు అమరావతి మహిళా రైతుల పై పోలీసు ల దాడులను ఖండిస్తూ తుళ్ళూరు గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించిన తుళ్ళూరు రైతులు

About The Author