రైలు ప్రయాణికులకు మరో శుభవార్త…
భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికులకు సరి కొత్తగా వినోదాన్ని అందిెచనుంది. హాయిగా కూర్చొని వినోద భరిత సినిమాలు చూడొచ్చు. మీకు నచ్చిన సినిమాలను ఎంచుకోవచ్చు. ఇందులో కొన్ని ఉచితంగా మరికొన్ని డబ్బులు చెల్లించాల్సి వుంటుంది.
సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ వీడియోలు అందిస్తున్నాయి. భారతీయ రైల్వేకు చెందిన టెలికాం సంస్థ అయిన రైల్టెల్ ఈ సేవలు అందించేందుకు జీ ఎంటర్టైన్మెంట్ అనుబంధ సంస్థ అయిన మార్గో నెట్వర్క్తో 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లల్లో కూడా ఈ సేవలు అందించనుంది. 2022 నాటికి పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.