నలుగురిని ఉరితీసినందుకు పవన్ కి ఎంతిస్తారో తెలుసా.. ?
నలుగురిని ఉరితీసినందుకు పవన్ కి ఎంతిస్తారో తెలుసా.. ?
ఉరితీసే తలారి దేవుడ్ని ఏం కోరుకుంటున్నాడో వినండి..
మీరట్ కు చెందిన పవన్ జలాద్ కు 58ఏళ్లు. అసలు పేరు సింధీరామ్. ఇతని తండ్రి, తాతలు కూడా ఉరితీసే తలారులుగానే ఉండేవారు. ప్రస్తుతం మీరట్ జైలులో తలారిగా ఉన్నాడు జలాద్. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మీనన్ ఉరి తర్వాత ఐదేళ్లకు ఇప్పుడు నిర్భయ హంతకులను ఉరి తీయబోతున్నారు. ఇటువంటి నేరాలు చేసేవారెవరైనా ఉరికంబం ఎక్కాల్సిందేనని ఉరితీసే తలారి పవన్ జలాద్ చెబుతున్నాడు. ఇతడి తండ్రి మమ్ము జలాద్, తాత కాలూరామ్ జలాద్, ముత్తాత లక్ష్మణ్ జలాద్ అందరూ ఉరితీసే తలారులే. తాను 22ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములను పటియాలా సెంట్రల్ జైల్ లో ఉరితీశానని పవన్ చెబుతున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు నలుగురిని మాత్రమే ఉరితీశానని, ఇప్పుడు నిర్భయ హంతకులతో ఒకేసారి నలుగురు కిరాతకులిని ఉరితీసే అవకాశం దొరికిందని ఆనందం వ్యక్తం చేశాడు. . నిర్భయ హంతకులను ఉరితీయాలన్న తన కోరికను భగవంతుడు ఆలకించాడని అన్నాడు. ఉత్తర ప్రదేశ్ జైళ్ల శాఖనుంచి తనకు నెలకు 5వేలు మాత్రమే జీతం రూపంలో వస్తుందని ఇప్పుడు ఈ నలుగురిని ఉరితీస్తే ఒక్కొక్కరికి 25వేల చొప్పున లక్ష రూపాయలు వస్తుందని అన్నాడు. 8మంది కుటుంబ సభ్యులతో కలసి పవన్ ఒకే గదిలో కాపురం ఉంటున్నారు. పవన్ కు భార్య, ఏడుగురు పిల్లలున్నారు. అందులో ఐదుగురు అమ్మాయిలు. బిడ్డలకు పెళ్లిల్లు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు పవన్. వీళ్లను ఉరితీస్తే ఆడపిల్లల తండ్రిగా తాను గర్విస్తానని, చనిపోయిన నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నాడు.