వాళ్లు లేచిపోయినా.. పెళ్లిబాజా మోగుతుంది..


బిడ్డలకు పెళ్లిళ్లు ఖాయంచేసి, పెళ్ళికొడుకు తండ్రి – పెళ్లికూతురు తల్లి లేచిపోవడంతో ఆగిపోయిన పెళ్లి ఫిబ్రవరి-13న జరగబోతోంది. యుక్త వయసులో పెళ్లి కూతురు తల్లికి, పెళ్లి కొడుకు తండ్రికి ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరు పెళ్లిళ్లు కావడంతో విడిపోయారు. మళ్లీ ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేయాలని నిర్ణయించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈలోగా ఇద్దరి మధ్య మళ్లీ పాత పరిచయాలు పెరిగి ప్రేమ చిగురించింది. దీంతో బిడ్డల పెళ్లి సంగతి వదిలేసి ఇద్దరూ మాట్లాడుకుని లేచిపోయారు. దీంతో ఇరు పక్షాల బంధువులు కూర్చుని పెళ్లి యథాప్రకారంగా చేసేయాలని నిర్ణయానికి వచ్చారు. పోలీసులు వారిద్దరు ఎక్కడున్నారో కనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ లోని కటర్గం లో జరిగిందీ విచిత్రం…

About The Author