TTD ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన తితిదే బోర్డు…
ముగిసిన టిటిడి పాలకమండలి సమావేశం..
✍️2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి.
✍️శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి…
✍️ఏడాది కంటే 66 కోట్ల మేర పెరిగిన టిటిడి బడ్జేట్.
✍️భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు….
✍️ తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం…..
✍️34 కోట్లు ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి నిర్ణయం..
✍️బర్డ్ ఆసుపత్రిలో అభివృద్ది పనులకు 8.5 కోట్లు కేటాయింపు….
✍️చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3.9 కోట్లు కేటాయింపు….
✍️హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని టిటిడి టెంపుల్ దగ్గర పుష్కరిణి, కళ్యాణమంటపం, వాహనమంటపం నిర్మాణానికి ఆమోదం…
✍️షోషియల్ మీడియాలో టిటిడి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేటందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్ క్రైమ్ విబాగం ఏర్పాటుకు నిర్ణయం….
✍️అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు…కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు, లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించిన టిటిడి..