నిత్యావసర సరుకుల విక్రయాలలో ప్రజలు సామాజికదూరం పాటించాలి వనపర్తి సిఐ:


వనపర్తి: దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ ను నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. లాక్ డౌన్,అందులో భాగంగానే ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ, కరోనా వైరస్ అంటువ్యాధి ప్రమాద తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి *కె,అపూర్వరావుips* గారి ఆదేశాల మేరకు

బుధవారం రోజు ఉదయం వనపర్తి సీఐ, సూర్యనాయక్,
వనపర్తి పట్టణ ఎస్సై,
వెంకటేష్ గౌడు గార్లు వనపర్తి పట్టణంలో ప్రణాళికాబద్ధమైన రీతిలో అత్యవసర, నిత్యావసర విభాగాల వివరాలను సేకరించి
మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు, కూరగాయలు, పాలు విక్రయించే ప్రదేశాలలో ప్రజలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో
ఆ దుకాణాల ముందు సామాజిక దూరం కనీసం ఒక మీటరు ఉండేవిధంగా సున్నంతో గడులను గీయించడం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన గడులలో వినియోగదారులు, ప్రజలు,యువకులు, చక్కటి క్రమశిక్షణతో విక్రయాలు చేస్తూ పోలీసులకు సహకరిస్తున్నారు.

ఈ సందర్భంలో ప్రజలతో సీఐ సూర్యనాయక్ మాట్లాడుతూ, వ్యక్తులు సామాజిక దూరం పాటించడం వలన కరోనా వైరస్ నివారించే అవకాశం ఉంటుందని, మనిషి ఒక వాహనంగా ముఖ్యంగా చేతుల ద్వారా వ్యాపించే
ఈ కరోనా మహమ్మారి విస్తృతం కాకుండా మనం తీసుకునే జాగ్రత్తల ద్వారా నివారించేందుకు అవకాశం ఉందని, కనుక ప్రజలు విధిగా సామాజిక దూరం పాటించాలని పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

జిల్లా పోలీసుశాఖ పక్షాన కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ, సామాజిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవడం, ముఖాన్ని అదేపనిగా చేతులతో తడుముకోకుండా ఉండడం వంటి అంశాలను తీసుకొనవలసిన జాగ్రత్తలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వ్యక్తుల వివరాలు, వారు ఎక్కడ నుండి వస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ, అవసరమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.

ఈ చర్యల వలన వనపర్తి పట్టణ ప్రజలకు, యువతకు చైతన్యం రావడంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా
తమ కాలనీల్లో
స్వీయనిర్బంధానికై కట్టుబాట్లు చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని అన్నారు.

ప్రతి పోలీసు పెట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరుగుతూ కరోనా వైరస్ నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యం గురించి ఆటోలో మైకుల ద్వారా అనౌన్స్ చేయించడం, పిల్లలను బయటకు పంపవద్దని ప్రచారం చేయడం మంచి ఫలితాలను ఇస్తున్నది.
పోలీసు శాఖ వైపు చేపడుతున్న వివిధ చర్యలకు ప్రజల వైపు నుండి చక్కటి తోడ్పాటు లభించడం అభినందనీయం. మనకొఱకు మనం సామాజిక బాధ్యతతో నడుచుకోవాలన్న ఆలోచనతో ప్రజలు ముఖ్యంగా యువత ఈరోజు పోలీసుకు సహకరించడం శుభపరిణామం.

ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉన్నందున ప్రజలు మరింత క్రమశిక్షణతో, ప్రభుత్వం సూచించిన మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ, చట్టానికి లోబడి నడుచుకోవాలని పోలీసు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల మేలు కొరకు పనిచేస్తుందని గ్రహించి పోలీసుకు సహకరించాలని సీఐ గారు పిలుపునిచ్చారు.

పి,ఆర్,ఓ
ఎస్పీ కార్యాలయం
వనపర్తి జిల్లా

About The Author