నటుడు నర్సింగ్ యాదవ్‌కు ప్రమాదం.. పరిస్థితి విషమం..!

సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ ప్రమాదవశాత్తు ఇంట్లో పడిపోయారు..

ఆయన తలకు తీవ్రగాయమైంది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
పలు తెలుగు సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ ప్రమాదానికి గురయ్యారు. గురువారం (ఏప్రిల్ 9న) సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ప్రమాదశాత్తు నర్సింగ్ పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది.

కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకి వెంటిలేర్‌పై చికిత్స అందిస్తున్నారు. తలకు బలమైన గాయమైందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

About The Author