కరోనా నేపథ్యంలో ఏసీలు, కూలర్ల వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు ఇవిగో!


★ ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం మరింత పెరగనుంది. అయితే కరోనా వైరస్ ఏసీలు, కూలర్ల కారణంగా మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

_*సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజినీర్స్ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది.*_

★ ఇళ్లలో ఏసీల వాడకంలో గది ఉష్ణోగ్రతను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలని, సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది.

★ వ్యాధికారక క్రిముల వ్యాప్తి నివారణకు ఇవి సరైన ఉష్ణోగ్రతలని వివరించింది.

★ *ఎయిర్ కండిషనర్లు*
తేమ వాతావరణంలో ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కు దగ్గరగా సెట్ చేయాలి. పొడి వాతావరణంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా జాగ్రత్త పడాలి. గది నలుమూలలకు గాలి ప్రసరించేందుకు ఫ్యాన్లు వాడొచ్చు.

★ పొడి వాతావరణం నెలకొని ఉంటే సంబంధిత తేమ శాతాన్ని 40 శాతం కంటే తక్కువ ఉంచరాదు.

★ ఏసీలు ఆన్ లో ఉన్నప్పుడు రూమ్ కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. ఏసీ గాలి అక్కడే పరిభ్రమించకుండా, సహజసిద్ధమైన రీతిలో శుభ్రపడుతుంది.

★ ఏసీలు వాడుతున్నప్పుడు బయటి నుంచి వచ్చేగాలి ఫ్రెష్ గా ఉండాలంటే కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. తద్వారా బయటి నుంచి దుమ్ము, ధూళితో కూడిన గాలిని నిరోధించవచ్చు.

★ *కూలర్లు* పరిశుభ్రమైన గాలి ప్రసరించాలంటే ఎవాపరేటివ్ కూలర్లు గాలిని బయటి నుంచి స్వీకరించేలా ఉండాలి.

★ ఎవాపరేటివ్ కూలర్లలో నీటి ట్యాంకులను శుభ్రపరచాలి. క్రిమినాశని రసాయనాలతో శుద్ధి చేయాలి. ఒకసారి వాడిన నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి.

★ కూలర్ల నుంచి వచ్చే తేమతో కూడిన గాలిని బయటికి పంపేందుకు కిటికీలు తెరిచే ఉంచాలి.

★పోర్టబుల్ ఎవాపరేటివ్ కూలర్లు బయటి నుంచి గాలిని స్వీకరించే ఏర్పాట్లు కలిగి వుండవు కనుక, ఆ తరహా కూలర్ల వాడకం నిలిపివేయాలి.

★ *ఫ్యాన్లు* తిరిగే సమయంలో గది కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి.

★ సాధారణ ఫ్యాన్లు తిరిగే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్ లో ఉండే మరీ మంచిది. మెరుగైన రీతిలో గదిలోని గాలి ఎప్పటికప్పుడు శుభ్రపడే అవకాశం ఉంటుంది.

About The Author