గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ


గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నది. నిన్న కేవలం 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసులు సేవలు అమోఘమని కొనియాడారు. కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు అవగాహన కల్పిస్తూ., ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మీటరు దూరం డిస్టన్స్ ఉండాలని, మాస్కులు ధరించాలి. ఇంకా కొన్ని రోజులు లాక్ డౌన్ కు సహకరిస్తూ.., ఇలాగే అందరం ఐక్యతతో కరోనా వైరస్ తరిమికొడదాం. ప్రతి ఒక్క రేషన్ కార్డు వినియోగదారునికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About The Author