600 మంది కి భోజనం అందజేసిన టాస్క్ ఫోర్స్…


కరోనా విధినిర్వహణ లో ఉన్న 600 మందికి మధ్యాహ్న భోజనం టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ పి రవిశంకర్, ఆయన స్నేహితుడు ఏపి స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు ఎజిఎమ్ వై. గుణ శేఖర్ లు బుధవారం అందజేశారు. రవిశంకర్ సతీమణి వినుత, కుమారుడు అభినందన్ కలిసి 600 ప్యాకెట్లలో విజిటబుల్ పలావు, ఒక కోడిగుడ్డు, ఆనియన్ రైతా లను తయారు చేశారు. వీటిని టాస్క్ ఫోర్స్ తరుపున తిరుపతి ప్రధాన రహదార్ల లో విధి నిర్వహణ లో ఉన్న పోలీసులు, మునిసిపల్ సిబ్బంది, పలువురు అన్నార్థులకు అందజేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ రవిశంకర్ గారు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ తో అనేక మంది ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని, గత మూడు రోజులు అల్పాహారం పంపిణీ చేసిన సమయంలో తెలుసుకున్నామని అన్నారు. దీనికి తన స్నేహితుడు, భార్య, కుమారుడు ఆర్థికంగా సహరించారని తెలిపారు. తమ వంతుగా ఆహారం అందజేసి మా వంతు సాయం చేస్తున్నామని అన్నారు. కాగా టాస్క్ ఫోర్స్ ఆర్ ఐ చెందు విధి నిర్వహణ లో ఉన్న పోలీసులకు అరటి పండ్లు పంపిణీ చేశారు.

About The Author