కరోనా నియంత్రణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు నుంచి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతుంది.
పాజిటివ్ కేసులు వచ్చిన వెంటనే వారిని కాంటాక్ట్చేసిన వారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించడము, వారికి చికిత్స అందించడం వల్ల కేసుల పాజిటివ్ కేస్ ల సంఖ్య తగ్గించగలిగాము. పాజిటివ్ వచ్చిన వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా చేసి వారిని ఇంటికి పంపించే క్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కంటిమీద కునుకులేకుండా రోగులకు అండగా నిలుస్తోంది.
లాక్ డౌన్ పొడిగించినా, కొన్ని ప్రాంతాలలో సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్త లపై మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు మంత్రి ఈటల రాజేందర్. మరోవైపు హాస్పిటల్స్ లో,మరియు గ్రామస్థాయిలో కరోన వైరస్ వ్యాధి పట్లాతీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు సోమవారం జిల్లా వైద్య శాఖ అధికారులు, సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో వ్యాధి లక్షణాలను గుర్తించడం, పరీక్షలు చేయించడం ,వారికి చికిత్స అందించడం ద్వారా వ్యాధి ముదరకుండా చూసుకోవాలని దీనిపై ప్రధానదృష్టిపెట్టాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ కు ఆదేశాలు జారీచేశారు మంత్రి ఈటల రాజేందర్.సర్వైలెన్స్ కంటోన్మెంట్ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పరీక్షలు చికిత్స అందించేందుకు తరలించడం అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అన్ని హాస్పిటల్స్ లో పూర్తిస్థాయి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని , అవసరమైన మేరకు వైద్యులను నియమించేందుకు అవసరం అయిన ప్రపోజల్స్ అందజేయాలని డాక్టర్ రమేష్ రెడ్డిని కోరారు మంత్రి ఈటల.గాంధీలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మరింత బలోపేతం చేయాలని మెరుగైన చికిత్స అందించేందుకు డాక్టర్ లతో సమావేశం కావాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని మంత్రి ఈటల కోరారు.
కరోన వైరస్ సోకకుండా ఉండేందుకు గర్భిణీలకు మరింత జాగ్రత్త తీసుకునే విధంగా అవగాహన కల్పించాలనివారికి ఇబ్బంది లేకుండా చూడాలని, డయాలసిస్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు ,టీబి రోగులు ఇతర దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగిత రాణా కు మంత్రి ఈటల పలు సూచనలు చేశారు.
ఇక బ్లడ్ బ్యాంకులలో రక్తం కొరత లేకుండా చూడాలని రక్తం కావాల్సిన వారికి సప్లై చేయలని, రక్తం సప్లై చైన్ విషయంలో జాగ్రత్త వహించాలని, తలసీమియా పేషెంట్లకు రక్తం అందేలా జాగ్రత్త వహించాలని ప్రీతి మీనాకి మంత్రి సూచించారు.
మందుల కొరత లేకుండా కావలసినంత నిల్వలు అన్ని ఆసుపత్రిలో ఉండేలా చూసుకోవాలని tsmidcఎండి చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి ఈటల సూచించారు.
కేసుల సంఖ్య పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మంత్రి చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉందని మంత్రి వివరించారు.
డయాలసిస్, గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్, దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్ లు తెరుచుకుంటున్న సందర్భంలో అందులో పనిచేస్తున్న డాక్టర్స్, సిబ్బంది, పేషంట్లు వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హాస్పిటల్ యాజమాన్య సంఘాలతో చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సూచించాలని కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి నీ కోరిన మంత్రి.
రాష్ట్రం లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను తు చ తప్పకుండా పాటించాలి అని మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అయితే ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని, సమస్యలు ఉన్న కుటుంబంలో కుటుంబ సభ్యులు తోడ్పాటు అందించాలని మంత్రి కోరారు.