రాత్రంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ అరుణమ్మ…


రాత్రంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ అరుణమ్మ…
కార్యకర్త విడుదల కోసం తానే వాహన డ్రైవర్, స్టేషన్ ఎదుట ఆందోళన, విడుదలతో ఇంటికి

అది 2018 డిసెంబర్ 6వ తేదీ రాత్రి పదకొండు గంటలు. తెల్లారితే అసెంబ్లీ ఓటింగ్. ఆ సమయంలో డికె అరుణమ్మ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఉన్నారు. ఉదయం ప్రారంభం కానున్న ఓటింగ్ పై ముఖ్యులతో సమాలోచన చేస్తున్నారు. ఆ సమయంలో ఆమెకు పార్టీకు చెందిన ముఖ్య నాయకుడు మిర్జాపురం రామాచంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం అందింది.
.
▪పిర్యాదు చేసిన విడుదల లేదు▪
అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను బలాదూర్ గా తిరిగేలా చేసి తన కార్యకర్తలనే లక్చ్యంగా చేసుకొని స్థానిక పోలీసులు నిర్బంధాలకు దిగుతున్నారని డికె అరుణ ఉన్నతాధికారులకు పోన్లో పిర్యాదు చేశారు. వెంటనే రామచంద్రారెడ్డి వదలి పెట్టాలని డిమాండ్ చేసారు. అప్పటికి రాత్రి పన్నెండు గంటలు అవుతున్నది. అయినా పోలీసులు రామచంద్రారెడ్డిని వదలేదు.

▪డ్రైవర్ సకాలంలో రాలేదు▪
పని ముగించుకుని వెళ్లిపోయిన డ్రైవర్ పోన్ చేసిన వెంటనే రాలేదు. తాను కూడా ఇంకా బోజనం చేయలేదు. ఆలస్యం అయ్యే కొద్ది నియోజకవర్గంలో పట్టున్న అన్ని గ్రామల్లో ఇలాంటి పరిస్థితులే తలేత్తుతాయాని తానే డ్రైవర్ గా మారారు. వాహన స్టీరింగ్ తన చేతులోకి తీసుకొని కూతురు స్నిగ్దా రెడ్డితో కలసి కేవలం పదహైదు నిముషాల్లో కెటి దొడ్డి పోలీస్టేషన్ కు చేరుకున్నారు.

▪విడుదల చెసాకే ఇంటికి▪
అలా రాత్రి 12 గంటలకు మొదలైన ఈ ఉత్కంఠత తెల్లవారుజామున 4.30 గంటకు అరుణమ్మ ఇంటికి చేరుకోవడంతో ( రామచంద్ర రెడ్డి విడుదల అనంతరం ) తెరపడింది.

( గత అసెంబ్లీ ఓటింగ్ కు ముందు రోజు జరిగిన ఈ సంఘటన డికె అరుణమ్మ జన్మదినం సందర్భంగా కార్యకర్తల కోసం )

About The Author