రంగారెడ్డి జిల్లా కొహెడ పండ్ల మార్కెట్ ని సందర్శించిన శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి .


రంగారెడ్డి జిల్లా కొహెడ పండ్ల మార్కెట్ ని సందర్శించిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి .
మార్కెట్ లో ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా కొత్తపేట నుండి కొహెడకి తరలించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు భాధ్యత వహించాలి .
ఈదురుగాలులతో షెడ్లు కూలి నష్టపోయిన రైతులను గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు
మార్కెట్ సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుంటుడంగా ఒక్క రైతు ఏడుస్తూ కనీసం తినడానికి తిండి ,త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం రాత్రి సమయాల్లో దొంగలు పండ్లు, పైసలు ఎత్తుకెళ్లుతున్నారు .ఇక్కడ కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చారు
వెంటనే సంబంధిత అధికారులు ఆర్డీవో రాచకొండ సీపీ గారితో మాట్లాడి నాసిరకం షెడ్లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు
రైతులకు ఎర్రటి ఎండలో ఉండటానికి నీడ త్రాగడానికి నీరు లేక పోవడం వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులతో రైతులకు నీరు ఉండటానికి టెంట్లు ఏర్పాటు చేయించారు

About The Author