ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్‌.. 8న ఇళ్ల పట్టాల పంపిణీ !


పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏపీ సర్కార్ ముహుర్తం ఖరారు చేసింది. జూలై8న పట్టాల పంపిణీ ప్రారంభించాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. ఈలోగా మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు వచ్చాయని మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు పెట్టాలన్నారు.

ఏపీలో రెండు సార్లు వాయిదా పడిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ ముచ్చటగా మూడోసారి ముహూర్తం ఖరారయ్యింది. జూలై 8న అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇళ్లపట్టాల పంపిణీ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరో 15 రోజుల్లో గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా పెట్టాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మే 6 నుంచి 21 వరకు గ్రామ సచివాలాల్లో జాబితాల ప్రదర్శన ఆ తర్వాత 15 రోజులు వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. జూన్ 7లోగా తుది జాబితా ప్రకటించాలని ఆదేశించారు. కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే చేయాలి తప్ప.. ఎవరు అన్యాయం జరిగిందనే మాట రాకుడదన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు సీఎం జగన్.

About The Author