5 పైసలుకే లీటరు పెట్రోల్..

5 పైసలుకే లీటరు పెట్రోల్.. చౌక ధరకే పెట్రోల్ అందిస్తున్న టాప్ 10 దేశాలివే!

లీటరు పెట్రోల్ ధర మన దేశంలో రూ.70 పైమాటే. కానీ చాలా దేశాల్లో ఈ ధర చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే పెట్రోల్ ధర పైసల్లో కూడా ఉంది. అవును మీరు చదివింది నిజమే. కొన్ని దేశాల్లో పెట్రోల్ ధర చాలా తక్కువగా ఉంది. లీటరు వాటర్ బాటిల్ కన్నా పెట్రోల్ ధర తక్కువగా ఉంది.
కరోనా వైరస్ దెబ్బకి క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా బాగా తగ్గుతాయని అందరూ భావించారు. కానీ ఇలా జరగలేదు. పైగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పైకి కదిలాయి. దీంతో విస్తుపోవడం ప్రజలవంతైంది. దీనికి ప్రధాన కారణంగా రాష్ట్రాలు వ్యాట్ పెంచేయడం. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కోవిడ్ 19 వల్ల ఆదాయాలు తగ్గడం వల్ల ఇన్‌కమ్‌ను పెంచుకోవడానికి ఢిల్లీ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటరు పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా పెంపు వల్ల దేశీ రిటైల్ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టతనిచ్చింది. అయితే ఇప్పుడు పెట్రోల్‌ను చౌక ధరకే అందిస్తున్న టాప్ 10 దేశాలు ఏంటివో చూద్దాం.

1. వెనిజులా
దక్షిణ అమెరికాలోని ఒక దేశం ఇది. ప్రపంచంలో తక్కువ ధరకే పెట్రోల్ విక్రయిస్తున్న దేశాల్లో ఇది టాప్‌లో ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర కేవలం 5 పైసలు. మన దేశంలోని పెట్రోల్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.71.21 తక్కువ. ప్రపంచంలో ఎక్కువగా ఆయిల్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలో క్రూడాయిల్ నిల్వలు ఎక్కువగా కలిగిన దేశాల్లో ఇది అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్ ధర కన్నా పెట్రోల్ ధర తక్కువగా ఉంటుంది.

2. ఇరాన్
ఇది రెండో స్థానంలో ఉంది. ఇరాన్‌లో ప్రజలు లీటరు పెట్రోల్ కోసం రూ.7.08 ఖర్చు చేస్తున్నారు. మన దేశంలోని పెట్రోల్ రేటుతో పోలిస్తే ఇరాన్‌లోని ప్రజలకు రూ.64 తక్కువకే పెట్రోల్ లభిస్తోంది. ఇరాన్ మధ్యప్రాచ్య దేశం. అధిక జనాభా కలిగిన దేశాల్లో జాబితాలో 18వ స్థానంలో ఉంది. దీన్ని పర్షియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమ చాలా పాపులర్. అక్కడ చాలా మంది ఇందులోనే ఉపాధి పొందుతున్నారు.

3. సుడాన్
తక్కువ ధరకే పెట్రోల్ విక్రయిస్తున్న దేశాల్లో సుడాన్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.10.51గా ఉంది. మన దేశంలోని పెట్రోల్ రేటుతో పోలిస్తే సుడాన్‌లో ధర రూ.60 తక్కువగా ఉంది. ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ క్రైమ్, టెర్రరిజం, కిడ్నాపింగ్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఒంటరిగా ప్రయాణించడం ప్రమాదకరమని భావించొచ్చు. డైవింగ్‌కు సుడాన్ ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. సుడాన్‌లో క్రూడాయిల్‌ను వెలికి తీస్తారు.
అంగోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా తక్కువ ధరకే పెట్రోల్ లభిస్తోంది. ఇక్కడ లీటరు పెట్రోల్ కోసం ప్రజలు రూ.21.79 ఖర్చు చేస్తున్నారు. ఇండియాతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్ ధర రూ.49 తక్కువ ధరకే లభిస్తోంది. మధ్య ఆఫ్రికా దేశాల్లో ఇది కూడా ఒకటి. వైవిధ్యభరితమైన భూభాగం, ఉష్ణమండల అట్లాంటిక్ బీచ్‌లు ఎక్కువగా ఉంటాయి. అయితే అంగోలా ప్రమాదకరమైన దేశమని చాలా మంది చెప్పుకుంటారు. అర్హతగల సిబ్బంది సహాయం లేకుండా అంగోలాలో ప్రయాణించకూడదు. కొన్ని ప్రాథమిక నియమాలను పాటిస్తే, అంగోలాలో ప్రయాణించడం ప్రమాదకరం కాదు.
చౌక ధరకే పెట్రోల్ అందిస్తున్న దేశాల్లో ఖతార్‌ కూడా ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.21.79గా ఉంది. అంటే మన దేశంతో పోలిస్తే ఖతర్‌లో పెట్రోల్ ధర రూ.49 తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది అరబ్ దేశం. దీని రాజధాని దోహా. ఆకాశహర్మ్యాలు, సున్నపురాయి ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియం, పురాతన ఇస్లామిక్ డిజైన్‌తో కూడిన ఇతర అల్ట్రామోడర్న్ నిర్మాణాలకు ఈ నగరం ప్రసిద్ధి. అధిక ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థ ఈ దేశం సొంతం. ఇక్కడ క్రూడాయిల్ నిల్వలు కూడా ఎక్కువే.

4. అంగోలా

5. ఖతార్

6. మలేసియా
మలేసియా కూడా తక్కువ ధరకే పెట్రోల్ అందిస్తున్న టాప్ 10 దేశాల సరసన స్థానం దక్కించుకుంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.21.91గా ఉంది. మన దేశంలో పెట్రోల్ ధరతో పోలిస్తే మలేసియాలో పెట్రోల్ ధర రూ.49 తక్కువగానే ఉంది. ఇది ఆగ్నేయాసియా దేశం. ఇది బీచ్‌లు, రెయిన్‌ఫారెస్ట్‌లకు ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ దేశ సంస్కృతిపై చైనీస్, ఇండియన్, యూరోపియన్ దేశాల ప్రభావాన్ని గమనించొచ్చు. ఇక ఈ దేశ రాజధాని కౌలాలంపూర్.

7. నైజీరియా
నైజీరియా కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాల్లో ఒకటి. ఇక్కడ కూడా పెట్రోల్ చౌక ధరకే అందుబాటులో ఉంది. లీటరు పెట్రోల్ కోసం నైజీరియన్లు రూ.23.88 ఖర్చు చేస్తున్నారు. అంటే మన దేశంలోని పెట్రోల్ రేటుతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్ ధర రూ.47 తక్కువగా ఉంది. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియా. పెట్రోలియం ప్రొడక్టుల ఉత్పత్తి, ఎగుమతి అనేది నైజీరియా ప్రధాన ఆదాయ వనరు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఆర్థిక వ్యవస్థకు ఇదే ప్రధాన ఇంధనం.

8. కువైట్
కువైట్ కూడా తన ప్రజలకు తక్కువ ధరకే పెట్రోల్ అందిస్తోంది. ఇది పశ్చిమ ఆసియా దేశం. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.25.66గా ఉంది. భారత్‌లోని పెట్రోల్ ధరతో పోలిస్తే ఇక్కడ ధర రూ.45 తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కువైట్‌లో క్రూడ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ దేశంలో కూడా క్రూడాయిల్ నిల్వలు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల అక్కడ వారికి పెట్రోల్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ దేశం ఇరాక్, సౌదీ అరేబియాతో సరిహద్దులను పంచుకుంటోంది.

9. మయన్మార్
చౌక ధరకే పెట్రోల్ అందిస్తున్న దేశాల్లో మయన్మార్‌ పదో స్థానంలో ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.27.40గా ఉంది. మన దేశంలోని పెట్రోల్ రేటుతో పోలిస్తే ఇక్కడ ధర రూ.43 తక్కువగా ఉండటం గమనార్హం. భారత్, చైనా, బంగ్లాదేశ్‌లో సరిహద్దు పంచుకుంటున్న దేశం ఇది. ఇక్కడ కూడా పెట్రోల్ ధర భారత్‌లో కన్నా అత్యంత తక్కువగా ఉండటం గమనించదగిన అంశం. మన దేశంలో మాత్రం లీటరు పెట్రోల్ ధర రూ.70 పైమాటే.

10. తుర్కమేనిస్తాన్‌
తుర్కమేనిస్తాన్‌లో కూడా పెట్రోల్ ధర తక్కువగా ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర దాదాపు రూ.30గా ఉంటుంది. మధ్య ఆసియా దేశాల్లో ఇది కూడా ఒకటి. మన దేశంలోని పెట్రోల్ ధరతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్ ధర రూ.40 తక్కువగా ఉండటం గమనార్హం. పత్తి ఉత్పత్తి, ఎడారి భూములు, ఎలక్ట్రిక్ ఉత్పత్తుల ఎగుమతి, సహజ వాయువు, చమురు నిల్వలు వంటి వాటికి ఈ దేశం చాలా పాపులర్. డోర్స్ ఆఫ్ హెల్ అనే ప్రదేశాన్ని చూడటానికి చాలా మంది ఇక్కడకు వెళ్తుంటారు.

About The Author