రెడ్ జోన్ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కఠిన నిబంధనలు


కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించిన అధికారులు, అక్కడ కఠిన నిబంధనలను అమలు చేస్తారు.

ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు ఉంటాయి.

ఇతరులు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు

విదేశాలకు, బయటకు వెళ్లి వచ్చిన వారి కారణంగా, ఏ ప్రాంతంలో అయితే, ఇతరులకు కరోనా వైరస్ సోకిందో, ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తారన్న సంగతి ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది

ఇక ఇక్కడి ప్రజలు ఎవరకీ బయటకు వచ్చేందుకు వీలు లేదు. వీధిలోకి కాదుగదా… కనీసం పక్కింటికి వెళ్లడానికి కూడా వీలు ఉండదు

పాలు, కూరగాయలు, నిత్యావసరాలను అధికారులే ఇళ్ల వద్దకు చేరుస్తారు. వాటిని కూడా ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాల్సి వుంటుంది.

తమ పక్క వీధిలో ఉంటున్న వారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నా, రెడ్ జోన్ పరిధిలోని వారు ఎంతో అత్యవసరమైతే, అది కూడా పోలీసుల అనుమతితోనే బయటకు రావాల్సి వుంటుంది.

ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు బయటివారెవరికీ అనుమతి ఉండదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ జోన్ వీధుల్లోకి ఇతరులను అనుమతించే ప్రసక్తే లేదు

ఇక రెడ్ జోన్ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధి వరకూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల సాయంతో పిచికారీ చేయిస్తారు

సదరు ప్రాంతానికి వెళ్లే అన్ని వైపులనూ బారికేడ్లతో దిగ్బంధించే పోలీసులు, ఆ ప్రాంతం రెడ్ జోన్ అని సూచించే బోర్డులను పెడతారు. అక్కడ 24 గంటలూ పోలీసు కాపలా ఉంటుంది.

గుర్తింపు పొందిన అధికారులు, హెల్త్ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి మాత్రమే బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

ఇక కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటికి, ఆ ఇంట్లో వైరస్ ఉందని సూచించేలా ప్రత్యేక స్టిక్కర్లను అంటిస్తారు.

ఇక ఈ ప్రాంతంలోని వారిలో ఎవరికైనా జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో, రోజుకు రెండు సార్లు హెల్త్ వర్కర్లు పరీక్షిస్తుంటారు.

ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారి నమూనాలను సేకరించి, క్వారంటైన్ చేస్తారు.

రెడ్ జోన్ల పరిధిలో కనీసం 14 రోజుల పాటు కఠిన ఆంక్షలుంటాయని,

ఈలోగా కొత్త కేసులు రాకుండా ఉంటేనే నిబంధనలు తొలగిస్తారు

కొత్త కేసులు వస్తే, ఆపై మరో 14 రోజులు ఇవే ఆంక్షలుం టాయి
__________________________
డాక్టర్ శ్రీకాంత్ అర్జా
ఏపీ స్టేట్ Covid నోడల్ ఆఫీసర్

About The Author