ఏపీ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలా..స్పెషల్ పాస్‌లకు ఇలా అప్లై చేసుకోండి..


అత్యవసర లేదా ముఖ్యమైన పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం స్పెషల్ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యుల మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ, అత్యవసర వైద్య చికిత్స వంటి పనుల కోసం మాత్రమే ఈ పాసులను జారీ చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేసింది.

ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వివరాలను సమర్పించిన అనంతరం పోలీసువారు..పని ప్రధాన్యతను బట్టి పాస్ ను ఆమెదిస్తారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వెహికల్ ఎమర్జెన్సీ పాస్‌ను పంపిస్తారు. ఈ మేరకు అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది.
కొన్ని అత్యవసర సమయాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలనతో పోలీస్ శాఖ ఈ పాస్‌ల జారీకి అవకాశం ఇచ్చింది. ఈ-పాస్ దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరి అని సూచించింది.

పాస్ కావాల్సిన వాళ్లు ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి

1) పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

2) ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్

3) ప్రయాణించేవారి వివరాలు

4) మెయిల్ ఐడీ

5) మొబైల్ నంబర్

6) అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు

7) వాహనానికి సంబంధించిన వివరాలు

About The Author