తుఫాన్ హెచ్చరికలతో కోస్తాలో అలర్ట్..
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది.
మరింత బలపడనున్న ఈ తుఫాన్‌కు వాతావరణ శాఖ ఎంఫాన్‌గా నామకరణం చేసింది.
ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 1,040 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కు నైరుతి దిశలో 1,200 కిలోమీటర్లు దూరంలోను.. కేంద్రీకృతమై ఉంది.
మరింత వేగంగా బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీనిప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
సముద్రంలో గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు.
ఏపీలోని ప్రధాన పోర్ట్ల్లో ఒకటవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు.