కరోనాపై విచారణ చేయండి.. కానీ, ఇప్పుడు కాదు…
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 73 వ వార్షిక సమావేశాల సందర్భంగా వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ప్రపంచదేశాలు ఒత్తిడి తీసుకొస్తున్న కరోనా వైరస్ మూలాలపై దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచదేశాలు మహమ్మారి సమస్యను ఎదుర్కొంటున్నందున.. సమస్యపై పట్టుసాధించిన తర్వాతనే ఈ కార్యక్రమాలను చేపట్టడం అందరికీ శ్రేయస్కరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన ఈవ్యాధి తొలుత బయటపడిన సమయంలో చైనా ప్రభుత్వం.. బహిరంగత, పారదర్శకతతో బాధ్యతతో వ్యవహరించిందని జిన్‌పింగ్ చెప్పారు.
సమావేశం ప్రారంభం కాగానే కొవిడ్-19పై దర్యాప్తు చేపట్టేందుకు ముందుకురావాలని యురోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానం తర్వాత.. ప్రారంభ సమావేశంలో ప్రసంగించాలని జిన్‌పింగ్‌కు సూచించారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జిన్‌పింగ్.. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు జరిపేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే, ప్రపంచ దేశాలు ఈ వైరస్‌పై పట్టుసాధించిన తర్వా