కలెక్టర్లతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్…


*సీఎం జగన్ పాయింట్స్..*

– చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గత ప్రభుత్వ ఇన్సెంటివ్ బకాయిలు రూ.905 కోట్లు 2 విడతల్లో చెల్లింపు.

– మే 22న సగం, జూన్ లో మిగిలిన బకాయిలు చెల్లింపు.

– ఎకానమీ పునరుద్దరణకు క్యాలెండర్ తయారుచేశాం.

– కలెక్టర్లు, జేసీలు జాగ్రత్తగా అమలు చేయాలి.

– కరెంట్ ఫిక్స్ డ్ ఛార్జీలను రద్దు చేస్తూ జీవో ఇచ్చాం.

– మూడు నెలలపాటు రద్దవుతాయి.

– మే 26న అర్చకులు, పాస్టర్లు, మౌజమ్ లకు రూ.5 వేల చొప్పున సాయం.

– మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం.

– గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఆర్బీకేలు మారుస్తాయి.

– దీని కోసం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లను కూడా నియమించాం.

– జూన్ 4న వైయస్ఆర్ వాహన మిత్ర ఇస్తున్నాం.

– సొంత ఆటో, క్యాబ్ ఉన్న వారికి వాహనామిత్ర ద్వారా రూ.10 వేలు సాయం.

– జూన్ 10న షాపు ఉన్న నాయిబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ.10 వేలు.

– జూన్ 17న మగ్గమున్న చేనేత కుటుంబాలకు వైయస్ఆర్ నేతన్న హస్తం.

– ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వ బకాయిలు జూన్ 17నే చెల్లిస్తాం.

– జూన్ 24న వైయస్ఆర్ కాపు నేస్తం.

– జూన్ 29న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల.

– జులై 1న 1060 కొత్త 104, 108 అంబులెన్స్ లు ప్రారంభం.

– మహానేత వైయస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా జులై 8న 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.

– జులై 29న రైతులకు వడ్డీలేని రుణాలు.

– ఆగస్ట్ 3న వైయస్ఆర్ విద్యా కానుక… పిల్లలకు యూనిఫాo, పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, షూలు, సాక్స్ లు ఇస్తాం.

– ఆగస్ట్ 9న ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ.

– ఆగస్ట్ 12న వైయస్ఆర్ చేయూత.

– ఆగస్ట్ 19న వైయస్ఆర్ వసతి దీవెన.

– ఆగస్ట్ 26న హోసింగ్ నిర్మాణం… 15 లక్షల వైయస్ఆర్ హోసింగ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం.

– సెప్టెంబర్ 11న వైయస్ఆర్ ఆసరా.

– సెప్టెంబర్ 25న వైయస్ఆర్ విద్యా దీవెన ప్రారంభం.

– అక్టోబర్ లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి రూ.4 వేలు.

– అక్టోబర్ లో హాకర్స్ కు ఆర్థిక సాయం… గుర్తింపు కార్డు ఉన్న ప్రతి చిరు వ్యాపారికి సున్నా వడ్డీకే రూ.10 వేల రుణం.

– 10 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు.

– డిసెంబర్ లో అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం.

– 2021, జనవరిలో రెండో విడత అమ్మ ఒడి… 2021 జనవరిలోనే చివరి విడత రైతు భరోసా, రూ.2 వేలు.

– 2021 ఫిబ్రవరి విద్యా దీవెన మూడో త్రైమాసం, రెండో దఫా వసతి దీవెన.

– 2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు: సీఎం శ్రీ వైయస్ జగన్.

About The Author