ఆకుపచ్చ సొనతో గుడ్లు పెడుతున్న కేరళ కోళ్ళు…


తిరువనంతపురం : కేరళలోని మళపురం సమీపంలో ఓ పౌల్ట్రీ ఫారంలోని కొన్ని కోళ్ళు పెట్టిన గుడ్లలో ఆకుపచ్చ సొన కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలను పౌల్ట్రీ యజమాని షిహబుద్దీన్ సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఆయనకు దేశ, విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.
మళపురం సమీపంలోని ఒతుక్కుంగల్‌లో ఓ పౌల్ట్రీ ఫారంలోని 6 కోళ్ళు పెట్టిన గుడ్లలో ఆకుపచ్చ సొన కనిపించినట్లు తెలియడంతో కేరళ వెటరినరీ, యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రారంభించారు.
దాదాపు తొమ్మిది నెలల క్రితం షిహబుద్దీన్ ఈ విషయాన్ని గమనించారు. తన పౌల్ట్రీలోని ఓ కోడి పెట్టిన గుడ్డులో సొన ఆకుపచ్చగా ఉన్నట్లు గమనించారు. ఇది తినడానికి సురక్షితమైనదేనా? అనే అనుమానం కలగడంతో దానిని ఆయన వాడలేదు.
ఆ కోడి పెట్టిన గుడ్లను పొదగడంతో పుట్టిన కోళ్లు కూడా ఆకుపచ్చ సొనగల గుడ్లనే పెడుతున్నట్లు గుర్తించారు.

About The Author