సూపర్ మార్కెట్ పై ఐదు కేసులు..!
♦హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితో కలిసి జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారులు సోదాలు నిర్వహించారు. రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారుల బృందం… నిబంధనలు పాటించనందుకు 5 కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.
♦కొన్ని రకాల నిత్యావసర సరుకులపై తయారీదారుల సంస్థ పూర్తి వివవరాలు లేకపోవడాన్ని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
♦ *ప్రతి వస్తువుపై తయారీదారుడి పూర్తి వివరాలు, తయారీ తేదీ, సంవత్సరం, గడువు తేదీకి సంబంధించిన వివరాలు తప్పక ఉండాలన్నారు*.
♦అన్ని వివరాలు ఉన్న వస్తువులను మాత్రమే ప్రజలకు విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు.
♦నిబంధనలకు విరుద్ధంగా నిత్యావసర సరుకులు విక్రయించినట్లయితే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారిణి అనురాధ తెలిపారు.