నాటుసారా స్థావరాలపై కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ దాడులు…


*జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు బంటుమిల్లి మండల పరిధిలోని అత్తమూరు ,రామవరపుమోడీ గ్రామాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్ ఐపీఎస్., గారు, బందరు డీఎస్పీ శ్రీ మహబూబ్ బాషా గార్ల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు*

*ఈరోజు తెల్లవారుజాము నుండి 130 మంది పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది, రెండు డాగ్ స్క్వాడ్ బృందాలతో అణువణువునా గాలించిన పోలీసులు*

*దాడులలో 3,000 లీటర్ల బెల్లం ఊట,50 లీటర్ల నాటుసారా స్వాధీనం, తయారీదార్ల పై కేసులు నమోదు*

*నాటు సారా తయారీ దారుల పై నిరంతర నిఘా, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లో ఎవరైనా పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తప్పవన్న జిందల్ గారు*

*మున్ముందు ఈ దాడులు మరింత ముమ్మరం చేస్తాం. ప్రజలందరూ నాటు సారా తయారీ జోలికి పోకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వీటినన్నిటిని విడిచిపెట్టాలి, నాటు సారా తయారీ కి పాల్పడితే పీడీ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదు చేసి, షీట్లు తెరుస్తాం*

*స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తయారీని విడిచిపెట్టిన వారికి ప్రభుత్వం తరఫున రావలసిన ప్రయోజనాలు అందేలా చూస్తాం*

*ఈ కార్యక్రమంలో బందరు డిఎస్పీ మహబూబ్ బాషా గారు, బందరు రూరల్ సిఐ కొండయ్య, చిలకలపూడి సిఐ వెంకట నారాయణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ గారు, బంటుమిల్లి ఎక్సైజ్ సిఐ అనుశ్రీ, బంటుమిల్లి ఎస్ఐ తులసి రామకృష్ణ పెడన ఎస్సై మురళి, ఎస్సైలు, 130 మంది సిబ్బంది పాల్గొన్నారు*

About The Author