టిటిడి 50 స్థలాలు అమ్మితే వచ్చే రూ.23 .92 కోట్లు ఆదాయం తిరుమల దేవుడికి ఆవసరమా..ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి


అనంతపురం:టిటిడి 50 స్థలాలు అమ్మితే వచ్చేది రూ.23 .92 కోట్లు ఆదాయంతో తిరుమల దేవుడికి ఆవసరమా అంటూ బీజేపీ.రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.ఈసందర్బంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ అనాలోచిత నిర్ణయాలతో హిందూ ధార్మిక సంస్థల విలువను ఎందుకు దిగజార్చతున్నారని విమర్శించారు.దేవాలయాల ఆస్తుల విషయంలో ఇతర మతాల ఆస్తులలో ఇలాగే నిర్ణయం తీసుకోనే దైర్యం ప్రభుత్వానికి ఉందాఅంటూ ప్రశ్నించారు.టిటిడి దేవ‌స్థానం 50 నిర‌ర్థ‌క ఆస్తుల విలువ‌ను రూ. 23.92 కోట్లుగా పాల‌క మండ‌లి ధ‌ర నిర్ణ‌యిస్తూ ఆమోదం తెలపడం, అమ్మడం అవసరమా అన్నారు.తిరుమల దేవుడి ఆస్తులు ప్రభుత్వం సంపాదించిన ఆస్తులు కాదు. ప్రతి పైసా బక్తుడి కష్టార్జితంతో సమర్పించినవి.టిటిడి ఆస్తులకు ప్రభుత్వం కాపలాదారుడు మాత్రమే. డబ్బు కోసం అమ్ముకునే హక్కు లేదు. భక్తులు విరాళాలుగా ఇచ్చిన ఆస్తులు అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు.మీరు దేవుడిలోఆదాయం చూస్తున్నారు. తక్షణం మీరు మీనిర్ణయాన్ని ఉపసంహరించుకోని కోట్లమంది భక్తుల మనోభావాలుకు విలువనివ్వండని తెలియజేసారు.

About The Author