హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు.. ఏడుగురిపై సీఐడీ కేసులు
★ ఏపీలో హైకోర్టు, వైసీపీ నేతల మధ్య వివాదం పెరుగుతోంది.
★ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
★ ఏపీలో హైకోర్టు, వైసీపీ నేతల మధ్య వివాదం పెరుగుతోంది.
★ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
★ దీంతో హైకోర్టుతో పాటు పలువురు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.
★ ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
★ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.
★ వీరు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.
★ _*అందులో దరిశ కిషోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్ సుస్వరం*_ ఉన్నారు.
★ వీరిపై ఐటీ యాక్ట్ సెక్షన్ 67, ఐపీసీ 505(2), ఐపీసీ 506, ఐపీసీ 153(ఏ)సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి.
★ కాగా మరోవైపు హైకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 49 మందికి మంగళవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.