సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు కామెంట్స్.


చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టు పక్షుల్లా మారారు.

టీడీపీది లిటిగెంట్ స్వభావం ఉన్న పార్టీ.

జగన్ ప్రభుత్వంపై వేరే విధంగా విమర్శలు చేయడం కుదరక సాంకేతిక పరమైన అంశాలతో అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వం సాంకేతికంగా.. న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొటుంటే.. ప్రభుత్వం తప్పులు చేస్తోందని విషతుల్యం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోంది.

తాము ఎందుకు ఓడిపోయామో టీడీపీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంటుంది.

జగన్ను చూసి నేర్చుకోమని లోకేషుకు చెబితే చంద్రబాబు గౌరవం నిలబడేది.

ఈ ఏడాది కాలంలో ప్రతి నిత్యం ప్రభుత్వంపై ఎదురు దాడి చేసే పరిస్థితి.

టీడీపీ హయాంలో కెబినెట్ సమావేశాలన్నీ టెండర్లు ఖరారు చేయడం.. బ్యాంకు గ్యారెంటీలకే సరిపోయింది.

అధికారాన్ని కేంద్రీకృతం చేయాలని అంతా భావిస్తోంటే.. జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రెండు వేల కోట్లు ఆదా చేశాం.. ఇది కన్నా లక్ష్మీనారాయణకు కన్పించదా..?

ఇంతకంటే ఏం ప్రూవ్ కావాలి.

అక్రమాలను వెలికి తీశాం.. దోషులను బయటపెడతాం.

ప్రజాస్వామ్య వ్యవస్థలో దోషులను బయటపెట్టడం కొంచెం ఆలస్యం అవుతుంది.

సౌదీ ఆరేబియా లాంటి దేశాల్లో చేసినట్టు చేయలేం కదా..?

మహా నాయకుడు కుటుంబాన్ని రోడ్డుకు లాగారు.

ఏడాది పాలనలో జగన్ సృష్టించిన రికార్డులని మరుగున పర్చేందుకే చంద్రబాబు ప్రయత్నం.

కోర్టుల్లో పడుతోన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏయే అంశాల్లో వేస్తున్నారో చూస్తే పరిస్థితేంటో అర్ధం అవుతోంది.

రోడ్డు మీద తాగి ప్రభుత్వాధినేతను తిడుతోంటే కోర్టులో కేసులు వేస్తారు.

ఆ కేసులను వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారు.

ఏడు రంగుల్లో ఏదో రంగు వేయాలి.. దీని పైనా కోర్టులకు వెళ్తాం.

ప్రభుత్వ భూములను పేదలకు ఇస్తున్నా.. పిటిషన్లు వేస్తున్నారు.

*ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకుంటే ఇబ్బందులే.*

మేమమీ కోర్టుల జోలికెళ్లడం లేదు.

అయితే కోర్టుల్లో జరుగుతోన్న పరిణామాల విషయంలో మాత్రం బాధేస్తోంది.

ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల విషయంలో కోర్టు తీర్పుతో కొంత బాధపడిన మాట వాస్తవమే.

అయితే కొంచెం జాప్యం అవుతుంది.

సుప్రీం కోర్టుకెళ్లి వెసులుబాటు పొందే ప్రయత్నం చేస్తాం.

ఎవ్వరి విషయంలోనైనా వ్యక్తిగత విమర్శలు చేయడానికి మేం వ్యతిరేకం.

స్థానిక ఎన్నికల నిర్వహాణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన నిమ్మగడ్డ.. వాయిదా వేసేటప్పుడు ఎందుకు సంప్రదించ లేదు.

నిమ్మగడ్డ రాసిన లేఖలో సీఎం జగన్ను ఫ్యాక్షనిస్టు అన్నట్టుగా ఎందుకు రాయాల్సి వచ్చింది..?

నిమ్మగడ్డ నిష్పాక్షింగా లేరు.. ఒక సైడు తీసుకున్నట్టు స్పష్టంగా కన్పిస్తోంది.

ఏజీ మాట్లాడితే నిమ్మగడ్డ కంటే ముందుగా యనమల స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది..?

*టీడీపీ ఈ ఎన్నికలను జరగనివ్వదల్చుకోలేదు.*

*ఈ వివాదాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ.. దీన్నో రాజ్యాంగ సంక్షోభం అన్నట్టుగా సృష్టించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ.*

About The Author