ఆపరేషన్ వికటించి పురిటి బిడ్డ మృతి డాక్టర్లు నిర్లక్ష్యం బంధువుల ఆరోపణ

చిత్తూరుజిల్లా:మదనపల్లె రూరల్ మండలం   పుంగనూరువాండ్లపల్లికి చెందిన ముబారక్ బేగం ( 23) డెలివరీ కోసం పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆదివారం చేరింది. సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో హాస్పిటల్ మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసుకోవాల్సిందిగా వారికి తెలియపరిచారు.  అయితే సమయం లేకపోవడంతో సాధారణ కాన్పు చేస్తున్నట్లు హాస్పిటల్ సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు తెలియపరిచారు. కొద్దిసేపటికే మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయి ఉండటం, పురిటి బిడ్డకు గాయాలు ఉండటం గమనించిన బాధితురాలి కుటుంబ సభ్యులు హాస్పటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా పురిటి బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

   ఆసుపత్రి ఎదుట దర్నా

పురిటి బిడ్డ మృతికి కారణమై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి సిజ్ చేయాలని ఆసుపత్రి ఎదుట సమీప బందువులు దర్నా నిర్వహించారు. వీరికి సిపిఐ, జనసేన నాయకులు ఈ సందర్భంగా ఆసుపత్రి ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. టూటౌన్ సిఐ రాజేంద్రనాధ్ యాదవ్, ఎస్ఐ మోహన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి అక్కడికి వచ్చి వారికి జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు. శాంతించని ఆందోళన చేస్తున్నవారు కేసు నమోదు చేయాలని పట్టుపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సాంబశివ, భాస్కర్, జనసేన నాయకులు నిమ్మనపల్లె రమేష్ పాల్గొన్నారు.

About The Author