ఆరోగ్యసేతులో ఆ లింకులు ఫేక్.. తస్మాత్ జాగ్రత్త..

కరోనా నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ.. వ్యాధిబారిన పడకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ పరిచయం చేసింది. కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడూ సమాచారం ఇస్తూ వస్తోంది. అయితే దీన్ని అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ లింకులను వదిలి డబ్బులు లాగేసుకుంటున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ నిఘాలో ఈ విషయం బయటపడటంతో ప్రజలను అప్రమత్తం చేశారు.

ఆరోగ్యసేతు యాప్‌ లింకుల పేరుతో వచ్చే వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు. పాక్ కేంద్రంగా కొంత మంది నేరగాళ్లు ఇలా ఫేక్ లింకులు పంపిస్తున్నట్టు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కూడా ముందు జాగ్రత్తలు చెప్పారు. ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే లింకుల ద్వారా హ్యాక్ చేసి డబ్బులు, విలువైన సమాచారం లాగేసుకుంటారని పేర్కొన్నారు.

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అధికారులు అందరిని అప్రమత్తం చేశారు.

About The Author