నిజాయితీకి అభినందనలు
చిత్తూరు జిల్లా:తిరుపతి,నిన్నటి దినం రాత్రి సుమారు 8:00pm గంటలకు తిరుపతి అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఒక బ్యాగ్ పడి ఉన్నదని, అటుగా వెళుతున్న పేరూరుకు చెందిన కే. సుబ్రహ్మణ్యం రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు వంశీకృష్ణ చూసి డయల్ 100 కు సమాచారం అందించారు. వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్ వారు కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వారి ఆదేశాలతో రక్షక్ 5 మొబైల్ వారిని సంబందిత ప్రాంతానికి వెళ్లవలసినదిగా ఆదేశించారు. రక్షక్ డ్యూటీ లో ఉన్న PC 2106 షఫీ, PC 2140 సుదాకర్ వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా అందులో సుమారు రూ. 28,000/- నగదు, ATM కార్డ్లు, ID కార్డ్లు ఉండినది. తదుపరి ID కార్డు చిరునామా ద్వారా విచారించగా పేరు సరస్వతి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నందు విధులు నిరహిస్తున్నట్లుగా, విధులు నిర్వహించి ఇంటికి చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పాళ్యం గ్రామానికి వెళ్ళుచుండగా మార్గ మధ్యంలో తన బ్యాగ్ ను పోగొట్టుకున్నానని తెలిపారు. తదుపరి జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు సరస్వతి గారిని పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు పిలిపించి కమాండ్ కంట్రోల్ సి.ఐ శ్రీనివాసులు, యస్.ఐ సుబ్బా నాయుడు గారిఅధ్వర్యంలోరూ.28వేలు,ఐడికార్డులు బ్యాగును ఆమె కు అందించారు.