భార్యను అమ్మేసిన భర్త..! నోట్లకట్టల కోసం కీచక నిర్వాకం
♦ మానవత్వం సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్ ఉదయ్‌పుర్ ఘంటాధర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
♦ జావేద్ ఖాన్ అనే వ్యక్తి రోజూ తాగేవాడు. తాగిన మత్తులో భార్యను చిత్రవధ చేయడం అతనికి అలవాటు.
నగ్నంగా ఫోటోలు తీసి చెప్పినట్టు చేయకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్మెయిల్ చేసేవాడు. స్నేహితులతో కలిసి భార్యను శారీరకంగా కూడా హింసించేవాడు.
♦ తాజాగా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుని ఆమెను వారికి అప్పగించేశాడు.
♦ రోజూ శారీరకంగా, మానసికంగా చిత్ర వధకు గురైన బాధితురాలు ఆ నరకం నుంచి కాపాడమని పోలీ సులను ఆశ్రయించింది.
♦వెంటనే స్పందించిన పోలీసులు ఆమెకు వైద్యం అందించి, భర్త జావేద్ ఖాన్, అతడి స్నేహితుడు మోనూను అదుపులోకి తీసుకుని తమ దైన శైలిలో విచారణ చేపట్టారు.