ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో, ఇంటర్ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు లో చోటుచేసుకుంది.
ఎస్సై నాగరాజు కథనం మేరకు
పట్టణానికి చెందిన బోయవీధికి చెందిన చిన్నతంబి, లక్ష్మీ ల చిన్న కుమార్తె మౌనిక స్థానికంగా ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం వెలువద్ద ఫలితాల్లో మార్కులు తక్కువ రావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.