మద్యం మత్తులో కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ లోఒకరు మృతి.

తిరుపతి :రూరల్ పరిధిలోని, వేదాంతపురం పంచాయతీ, రామచంద్రాపురం కాలనీలోని వెల్డింగ్ షాపు లో ఘటన.మృతి చెందిన వ్యక్తి తిరుపతి పద్మావతి పురం కు చెందిన సురేష్(35 )గా పోలీసులు గుర్తింపు.

తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా,రాజీవ్ నగర్ ,కు చెందిన  నటరాజన్ పద్మావతి పురం కు చెందిన సురేష్ లు ఇరువురు వెల్డింగ్ షాపు యజమాని ఉమాపతి దగ్గర పనులు చేసుకుంటూ జీవనంసాగించేవారు.ఆదివారం తెల్లవారు జామున మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో నటరాజన్ చేతిలో సురేష్ మృతి.తలపై రాడ్ తో కొట్టి హత్యకు,పాల్పడిన నిందితుడు తల పగిలి, తీవ్రంగా రక్తస్రావం.ఆదివారం ఉదయం  షాపు యజమాని ఉమాపతి, హత్యకు పాల్పడిన నటరాజన్ ను పట్టుకొని,తిరుచానూరు,పోలీసులకుసమాచారంఅందించాడు,ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు  సి ఐ .సురేంద్ర రెడ్డి.

About The Author